తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jio 5g Services In Telangana: మరో 14 పట్టణాల్లో జియో 5 జీ సేవలు ప్రారంభం

Jio 5G Services in Telangana: మరో 14 పట్టణాల్లో జియో 5 జీ సేవలు ప్రారంభం

HT Telugu Desk HT Telugu

13 April 2023, 18:01 IST

    • Jio 5g Services: రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5 జీ సేవ‌ల‌ను తెలంగాణలోని ఒక్కో నగరానికి విస్తరించే పనిలో పడింది. కొత్తగా మరో 14 పట్టణాల్లో సేవలను ప్రారంభించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
జియో 5జీ సేవలు
జియో 5జీ సేవలు

జియో 5జీ సేవలు

Jio 5g Services in Telangana: రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను తెలంగాణలో వేగంగా విస్తరించే పనిలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19 నగరాల్లో ప్రారంభించగా...తాజాగా మరో 14 పట్టణాల్లో కూడా సేవలను షురూ చేసింది. కొత్తగా జియో 5జీ సేవలు... కామారెడ్డి, మిర్యాలగూడ, పాల్వంచ, గద్వాల, ఆర్మూర్, సిరిసిల్ల, భువనగిరి, బోధన్, వనపర్తి, బెల్లంపల్లి, కాగజ్ నగర్, పెద్దపల్లి, కోరుట్ల, మందమర్రి నగరాల్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

Kamareddy DMHO: కామారెడ్డిలో కామపిశాచి, వైద్యులపై వేధింపుల కేసుతో జిల్లా వైద్యాధికారి అరెస్ట్

BRS Protest: బోనస్ బోగసేనా?... రోడ్డెక్కిన బీఆర్ఎస్.. ప్రభుత్వ తీరుపై ధర్నాలు, రాస్తారోకోలతో BRS నిరసన

Hyderabadi In UK Polls: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో సిద్ధిపేట ఐటీ ఇంజనీర్‌, లేబర్ పార్టీ తరపున పోటీ

Graduate Mlc Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై బీజేపీ గురి, కీలక నేతలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు

రాష్ట్రంలో ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాల, సిద్ధిపేట, సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, కోదాడ, తాండూర్, జహీరాబాద్, నిర్మల్, సూర్యాపేటలో రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కొత్తగా ప్రారంభించిన 14 నగరాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 నగరాల్లో జియో వినియోగదారులు 5జీ సేవ‌ల‌ను పొందవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.

జియో ట్రూ 5జీ సేవల ప్రారంభంతో తెలంగాణ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి మరియు ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. జియో ట్రూ 5 జీ పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. చిట్ట‌చివ‌రి అడుగు వ‌ర‌కు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఈ సందర్భంగా జియో తెలంగాణ సీఈఓ కే సీ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ లో జియో ట్రూ 5జీని మరో 14 నగరాలకు విస్తరించడం పట్ల సంతోషంగా ఉంది. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుంది. జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికి ట్రూ -5 జి ప్రయోజనాలను అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారు. అందువ‌ల్ల ఈ గ‌ణ‌నీయ‌మైన మార్పుకు ఉన్న శ‌క్తి, దాని అపార ప్ర‌యోజ‌నాల‌ను మ‌న దేశంలోని ప్ర‌తి పౌరుడు అనుభవించగలడు. తెలంగాణ ను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అన్నారు.

ఇక ఈ 14 నగరాల్లో జియో వినియోగదారులకు జియో వెల్కం ఆఫర్ ఆహ్వానం అందుతుంది. దీనిద్వారా వారు అదనపు ఖర్చు లేకుండా 1 జిబిపిఎస్ + వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చు.

పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ సేవలు

జియో ప్లస్ పేరుతో జియో కొత్తగా ప్రవేశపెట్టిన పోస్ట్ పెయిడ్ ఫామిలీ ప్లాన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్ ద్వారా ఒక కుటుంబంలోని నలుగురికి కేవలం రూ. 696 లతో నెల మొత్తం మొబైల్ సేవలు అందుతాయి. ఒక వినియోగదారుడు గరిష్టంగా 4 కొత్త కనెక్షన్‌లకు 30 రోజుల ట్రయల్ పీరియడ్ ఆఫర్‌తో పూర్తిగా ఉచితంగా ఉత్తమ పోస్ట్‌పెయిడ్ సేవలను పొందవచ్చు.

ఈ ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ లో మొదటి వ్యక్తికి నెలకు రూ. 399 ఛార్జ్ పడుతుంది. అదనంగా తీసుకునే ప్రతీ కనెక్షన్ కు రూ. 99 మాత్రమే చార్జి అవుతుంది. అంటే, మొత్తం నలుగురు కుటుంబ సభ్యులకు రూ. 696 ల కనీస మొత్తం మాత్రమే చార్జ్ అవుతుంది. అంటే, ఒక్కో సభ్యుడి నెలవారీ మొబైల్ ఖర్చు రూ. 174గా ఉంటుంది. మొత్తం ఫ్యామిలీకి ఒకే బిల్ వస్తుంది. అలాగే ఈ ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే, ప్లాన్ లోని కుటుంబ సభ్యులు తమ డేటాను షేర్ చేసుకోవచ్చు. డైలీ డేటా లిమిట్ ఉండదు. జియో ట్రూ 5జీ వెల్ కం ఆఫర్ ద్వారా అన్ లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు. మీకు నచ్చిన మొబైల్ నెంబర్ ను ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం కంటెంట్ ను ఉచితంగా పొందవచ్చు. ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా ఉచితంగా పొందవచ్చు. నెట్ ఫ్లిక్స్, ఆమెజాన్, జియోటీవీ, జియో సినిమా యాప్స్ చూడొచ్చు. జియో ఫైబర్ యూజర్లు, కార్పొరేట్ ఉద్యోగులు, వేరే టెలీకాం సంస్థలకు చెందిన పోస్ట్ పెయిడ్ కస్టమర్లు, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు అదనంగా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. వేరే నెట్ వర్క్ నుంచి సత్వరమే జియోకు మారవచ్చు.

జియో ప్లస్ కనెక్షన్ కోసం వినియోగదారులు 7000070000 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. వాట్సాప్ లో పూర్తి వివరాలు అందుతాయి. సిమ్ ఫ్రీ హోం డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ మినహాయింపు కోసం సంబంధిత ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఇప్పటికే జియో ప్రీ పెయిడ్ సిమ్ వాడుతున్నవారు కూడా ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ కు మారవచ్చు. వారు తమ ఫోన్లో ఇన్ స్టాల్ అయి ఉన్న మై జియో (MyJio) యాప్ లోకి వెళ్లి ‘prepaid to postpaid’ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత ఫ్రీ ట్రయల్ ప్లాన్ ను ఎంచుకోవాలి. మరిన్ని వివరాలకు www.jio.com/jioplus  వెబ్ సైట్ ను సందర్శించండి.

తదుపరి వ్యాసం