Jio plan: సరికొత్త 599 ప్లాన్ తో జియో మరో సంచలనం
Jio 599 plan: ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా లేటెస్ట్ ప్రి పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ను రిలయన్స్ జియో తీసుకువస్తుంటుంది. అందులో భాగంగానే ఇప్పడు కొత్తగా రూ. 599 ప్లాన్ ను తీసుకువచ్చింది.
Jio new 599 plan: ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా లేటెస్ట్ ప్రి పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ను రిలయన్స్ జియో (Reliance Jio) తీసుకువస్తుంటుంది. అందులో భాగంగానే ఇప్పడు కొత్తగా రూ. 599 ప్లాన్ ను తీసుకువచ్చింది. ఇందులో రోజుకు రూ. 19 కే అపరిమిత 4G మరియు 5G డేటాB(5G data) లభిస్తుంది.
Jio new 599 plan: అన్ లిమిటెడ్ డేటా..
ఉచిత ఇన్‌కమింగ్ మరియు అవుట్‌గోయింగ్ కాల్స్ తో భారతీయ టెలికాం మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జియో (Reliance Jio) ఇప్పుడు సంచలనానికి తెరతీసింది. మొదటి సారిగా అపరిమితమైన డేటా ఆఫర్‌తో ముందుకు వచ్చింది. రూ. 599 నెలవారీ ప్లాన్ ద్వారా కస్టమర్లు అపరిమితమైన వాయిస్ కాలింగ్, అపరిమితమైన 4G డేటా మరియు రోజుకు 100 SMSలను పొందే వీలుంది. ఈ ప్లాన్ తో వినియోగదారులు అదనంగాJio TV, Jio Cinema మరియు Jio Cloudతో సహా మరిన్ని Jio యాప్ సేవలను ఉచితంగా పొందుతారు. జియో వెల్‌కమ్ ఆఫర్ కింద అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమితమైన Jio True 5G డేటా కూడా లభిస్తుంది.
Jio new 599 plan: రోజుకు కేవలం రూ. 19 లకే..
ప్రీపెయిడ్ నుండి పోస్ట్‌పెయిడ్‌కు మారాలనుకొనే వారికి మరియు ప్రీమియం సేవలను అనుభవించాలనుకునే కొత్త కస్టమర్‌లకు జియో ఈ ప్లాన్ యొక్క 30-రోజుల ఉచిత ట్రయల్‌ని కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ తో రోజుకు కేవలం రూ. 19 అతి తక్కువ ఖర్చుతో వినియోగదారులు బహుళ ప్రయోజనాలను పొందగలరు.