తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kcr Tour : జనగామ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్, రైతుకు రూ.5 లక్షలు ఆర్థికసాయం

KCR Tour : జనగామ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్, రైతుకు రూ.5 లక్షలు ఆర్థికసాయం

31 March 2024, 14:24 IST

KCR Tour : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్(KCR) జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆదివారం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని ధరావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను కేసీఆర్ పరామర్శించారు. ఎండిపోయిన పంటలను పరిశీలించారు.

  • KCR Tour : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్(KCR) జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆదివారం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని ధరావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను కేసీఆర్ పరామర్శించారు. ఎండిపోయిన పంటలను పరిశీలించారు.
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సాగునీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఆవేదనతో ఉన్నారు. రైతులకు బాసటగా నిలిచేందుకు, అన్నదాతల సమస్యలు తెలుసుకునేందుకు కేసీఆర్ (KCR Districts Tour)జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్‌ తండాకు చేరుకున్నారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు.
(1 / 6)

రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదని బీఆర్ఎస్(BRS) ఆరోపిస్తోంది. దిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ, సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలలో బిజీగా ఉన్నారని ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ, నీళ్లందక ఎండిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. 
(2 / 6)

నీళ్లందక పొలం ఎండిపోయింది, కొడుకు పెళ్లి ఉందని తమ బాధలు చెప్పుకున్న రైతు కుటుంబానికి కేసీఆర్ రూ. 5 లక్షల ఆర్థిక సాయం(Financial Assistance) చేస్తామని ప్రకటించారు. నీళ్లు అందక ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. ఆదివారం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని ధరావత్ తండాలో పంట ఎండిపోయి(Crops Dried up) తీవ్రంగా నష్టపోయిన రైతులను కేసీఆర్ పరామర్శించారు. దుఃఖంలో ఉన్న రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. 
(3 / 6)

నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాక నాలుగు ఎకరాల పంటను కోల్పోయిన ఆంగోతు సత్తెమ్మ కేసీఆర్(KCR Helps Farmer) ముందు తన గోడువెల్ల బోసుకుంది. బోర్లు వేసి నీళ్లు రాక పంటలు ఎండిపోయి దాదాపు నాలుగైదు లక్షల అప్పు అయిందని కేసీఆర్ ముందు విలపించారు. తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని పంట ఎండిపోవడంతో చేతిలో చెల్లి గవ్వలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవడంతో తక్షణమే స్పందించిన కేసీఆర్ సత్యమ్మ కుమారుని వివాహ ఖర్చు నిమిత్తం ఐదు లక్షల రూపాయలను ప్రకటించారు.
(4 / 6)

రైతులు ధైర్యంగా ఉండాలని పోరాడి మన నీళ్లను మనం సాధించుకుందామని.. 24 గంటల కరెంటును(24 hrs Power)  సాధించుకుందామని కేసీఆర్ అన్నారు. రైతు రుణమాఫీని, రైతు బంధు(Rythu Bandhu) పోరాడి సాధించుకుందామని భరోసా ఇచ్చారు. 
(5 / 6)

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. సూర్యాపేట జిల్లా ఈదుల పర్రె తండా చెక్ పోస్ట్ వద్ద కేసీఆర్‌ వాహనాన్ని(KCR Vehicle Checked) ఆపిన ఎన్నికల అధికారులు, పోలీసులు విధి నిర్వహణలో భాగంగా తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్(Election Code) ను అనుసరించి పోలీసులకు కేసీఆర్‌ సహకరించారు. కేసీఆర్‌ బస్సుతో పాటు ఆయన వెంట వస్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు.  
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి