Rape Case: యూ ట్యూబ్ ఫేమ్ మల్లిక్ తేజ్‌పై రేప్ కేసు నమోదు చేసిన జగిత్యాల పోలీసులు
30 September 2024, 6:43 IST
- Rape Case: జగిత్యాల జిల్లాలో యూ ట్యూబ్ ఫేం ఫోక్ సాంగ్ సింగర్, రైటర్ సాంస్కృతిక సారధి ఉద్యోగి మల్లిక్ తేజ పై రేప్ కేసు నమోదు అయింది. ఫోక్ సాంగ్ సింగర్ అయిన యువతి పిర్యాదుతో జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జగిత్యాల యూట్యూబర్‌పై రేప్ కేసు నమోదు
Rape Case: జగిత్యాలలో సోషల్ మీడియాలో ఫేమ్ అయిన యూట్యూబర్‌పై రేప్ కేసు నమోదైంది. జిల్లాలోని బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన మల్లిక్ తేజ రైటర్ సాంస్కృతిక సారధి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. యూ ట్యూబ్ ఫేమ్ గా సుపరిచితులు. అదే గ్రామానికి చెందిన యువతి ఫోక్ సాంగ్ సింగర్ తో పరిచయం ఏర్పడింది.
ఇద్దరు ఫోక్ సాంగ్ సింగర్ లు కావడంతో పలు అల్బమ్ లు తీశారు. ఏమైందో ఏమో కానీ ఆ యువతి మల్లిక్ తేజ పై పోలీసులకు పిర్యాదు చేసింది. మాటలు చెప్పి లొంగ తీసుకొని అత్యాచారం చేశాడని పిర్యాదు లో పేర్కొంది. బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపిస్తుంది.
పెళ్లి చేసుకోవాలని తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని యువతి ఆవేదనతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. దుర్భాషలాడాడని సింగర్ మల్లిక్ తేజ పై యువతితో పాటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పరారీలో మల్లిక్ తేజ…
యువతి పిర్యాదు తో మల్లిక్ తేజపై అత్యాచారం వేదింపులు కేసు నమోదు కావడంతో పరారీలో ఉన్నాడు.
జగిత్యాల పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం జగిత్యాల కలెక్టరేట్ లో ప్రభుత్వ పథకాల ప్రచారం సాంస్కృతిక సారధి లో కళాకారుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. యువతి పిర్యాదుతో మల్లిక్ తేజ కుటుంబ సభ్యులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.
ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది…
మల్లిక్ తేజకు వివాహం అయింది. భార్య ఉంది. యూ ట్యూబ్ ఫేమ్ గా సుపరిచితులైన యువతి, మల్లిక్ తేజ పలు సాంగ్ లు పాడి వీడియో అల్బమ్ చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. అందుకు సంబంధించిన డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య చెడినట్లు సమాచారం. ఇద్దరు కళాకారులుగా ఫోక్ సాంగ్ పాడి ఆల్బమ్ లో నటించి విదేశాలకు సైతం వెళ్లి వచ్చారు.
అయితే ఇటీవల ఎవరికి వారే యూట్యూబ్ ఛానల్ లో పాటలు పాడి అప్లోడ్ చేస్తున్నారు. అంతకుముందు ఇద్దరు కలిసి చేసిన పాటల ఆల్బమ్ సంబంధించిన డబ్బులు విషయంలో ఇద్దరు మధ్య మనస్పర్ధలు రావడంతో యువతి పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన యువతి మీడియా ముందు నోరు విప్పకపోగా ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)