తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  It Raids In Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ తనిఖీల కలకలం

IT Raids In Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ తనిఖీల కలకలం

HT Telugu Desk HT Telugu

05 October 2023, 8:19 IST

google News
    • IT Raids In Hyderabad: హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు  జరుగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు  100 బృందాలతో  ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నగరానికి చెందిన పలు కంపెనీలతో పాటు వ్యక్తుల ఇళ్లలో ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. 
హైదరబాద్‌లో ఐటీ సోదాలు
హైదరబాద్‌లో ఐటీ సోదాలు (HT_PRINT)

హైదరబాద్‌లో ఐటీ సోదాలు

IT Raids In Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నగరానికి చెందిన పలువురు వ్యాపారవేత్తల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దాదాపు బృందాలతో ఈ తనిఖీలు చేపట్టారు.

ఇ-కామ్ సంస్థ నిర్వాహకుడు రఘువీర్ నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రఘువీర్‌ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టారు. గత ఐదేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్నులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఐటీ శాఖ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ రిటర్నులపై అనుమానాలు వ్యక్తం కావడంతో వాటిని నివృత్తి చేసుకుంటున్నారు.

ఎల్లరెడ్డగూడలోని వ్యాపారి మాగంటి వజ్రనాథ్‌ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందూ ఫార్చూన్‌లో కూడా ఐటీ బృందాలు సోదాలు జరుగుతున్నాయి. పదిమంది బడా కాంట్రాక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రసాదరావు, రఘువీర్‌, కోటే‌శ్వరరావు, రఘు అనే వారి ఇళ్ళలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. పన్నుల ఎగవేతకు సంబంధించిన వ్యవహారంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

అటు తమిళనాడులో కూడా డిఎంకె ఎంపీ జగద్రక్షన్‌ నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చెన్నై, వేలూరు, అరక్కోణం, కోయంబత్తూరు ప్రాంతాల్లో ఉన్న జగద్రక్షన్ కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. దాదాపు 150మంది ఐటీ సిబ్బంది 70ప్రాంతాల్లో ఏక కాలంలో తనిఖీలు చేపట్టింది.

తదుపరి వ్యాసం