తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Tirumala Tour Package : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరలోనే 'తిరుమల' టూర్ ప్యాకేజీ

IRCTC Tirumala Tour Package : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరలోనే 'తిరుమల' టూర్ ప్యాకేజీ

02 December 2023, 9:23 IST

google News
    • IRCTC Hyderabad Tirumala Tour Package : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ప్రత్యేక ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది.
తిరుమల టూర్ ప్యాకేజీ
తిరుమల టూర్ ప్యాకేజీ

తిరుమల టూర్ ప్యాకేజీ

IRCTC Tirumala Tour Package : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. తిరుపతి వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. 'GOVINDAM' పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు మార్గంలో వెళ్లొచ్చు. తిరుమల, తిరుచానూర్ ఆలయాలను దర్శించుకోవచ్చు. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ డిసెంబర్ 9, 2023వ తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ హైదరాబాద్ లోని లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్, నల్గొండ స్టేషన్లల్లో కూడా స్టాప్ ఇచ్చారు. ఇక్కడ ఎక్కాలనుకునేవారు ఎక్కొచ్చు.

డే 1 : లింగంపల్లి(Lingampally) నుండి సాయంత్రం 05:25 గంటలకు రైలు(ట్రైన్ నెంబర్ - 12734) బయలుదేరుతుంది. సికింద్రాబాద్ 06:10 గంటలకు చేరుకుంటుంది. రాత్రంతా ప్రయాణంలో ఉంటారు.

డే 2 : తిరుపతి(Tirupati)కి ఉదయం 05:55 గంటలకు చేరుకుంటారు. పికప్ చేసుకుని.. హోటల్‌కి తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత... ఉదయం 8 గంటల సమయంలో శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది. అనంతరం హోటల్ కు చేరుకొని లంచ్ చేస్తారు. ఆ తర్వాత తిరుచానూరు ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక సాయంత్రం 06. 25 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

డే 3: ఉదయం 03:04 గంటలకు నల్గొండ, 05:35 సికింద్రాబాద్ స్టేషన్, 06:55 నిమిషాలకు లింగంపల్లి స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

ఈ గోవిందం టూర్ ప్యాకేజీలో వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 4940, డబుల్ ఆక్యూపెన్సీ రూ. 3800, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.3800గా నిర్ణయించారు. కంఫర్ట్ క్లాసులో చూస్తే... సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 6790గా ఉంది. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే వారికి వేర్వురు ధరలు నిర్ణయించారు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ బుకింగ్ చేసుకోవటంతో పాటు ఇతర టూర్ ప్యాకేజీ వివరాలను తెలుసుకోవచ్చు.

తదుపరి వ్యాసం