IRCTC Tourism: హైదరాబాద్ టూ షిరిడీ... 2 రోజుల టూర్.. ప్యాకేజీ వివరాలివే
12 June 2022, 8:33 IST
- హైదరాబాద్ నుంచి షిరిడీకి టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఫ్లైట్ జర్నీ చేసేందుకు ప్రయాణికులకు అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
హైదరాబాద్ షిర్డీ టూర్
Shirdi Sai Darshan With Shani Shingnapur: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా షిరిడీ సాయిబాబా భక్తుల కోసం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి షిర్డీకి ఫ్లైట్‌లో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. షిరిడీ సాయి దర్శన్ విత్ శని శిగ్నాపూర్ (Shirdi Sai Darshan With Shani Shingnapur) పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది.
వివరాలివే....
1 రాత్రి, 2 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. వీకెండ్‌లో ఈ టూర్ అందుబాటులో ఉంటుందని ఐఆర్‌సీటీసీ టూరిజం పేర్కొంది. షిర్డీతో పాటు శని శిగ్నాపూర్ ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతుంది. షిర్డీ టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఉదయం 10.10 గంటలకు హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం ఎక్కితే మధ్యాహ్నం 12.05 గంటలకు షిర్డీకి చేరుకుంటారు. హోటల్ కి వెళ్లిన అనతరం.. సాయిబాబా దర్శనం ఉంటుంది. రాత్రికి షిరిడీలోనే బస చేయాల్సి ఉంటుంది. రెండో రోజు ఉదయం శని శిగ్నాపూర్ బయల్దేరుతారు. శని శిగ్నాపూర్ ఆలయ సందర్శన తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5.35 గంటలకు షిరిడీ ఎయిర్‌పోర్టులో బయల్దేరితే సాయంత్రం 6.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ముగుస్తుంది.
ధర ఎంతంటే...
షిర్డీ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.10,510, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10,700, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11,635 చెల్లించాలి. 2 నుంచి 4 సంవత్సరాల్లో ఉండే పిల్లలకు రూ. 8405గా ధర నిర్ణయించారు. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, ఒక రాత్రి షిరిడీలో బస, బ్రేక్‌ఫాస్ట్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. లోకల్ ట్రాన్స్ పోర్ట్, ఆలయాల ఎంట్రెన్స్ దగ్గర లంచ్, డిన్నర్, స్నాక్స్ ఖర్చులు ప్రయాణికులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఒరిజినల్ ఐడీ కార్డ్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది.
నోట్:
ఈ టూర్ ను బుకింగ్ చేసుకునేందుకు ఈ లింక్  ద్వారా వివరాలను నమోదు చేసుకోవచ్చు.