Independence Day Offers : ఆర్టీసీ ఇచ్చే ఈ 9 ఆఫర్లు మీరు అస్సలు వద్దనరు
14 August 2022, 20:23 IST
- భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని TSRTC పలు ఆఫర్లను ప్రకటించింది. మెుత్తం తొమ్మిది ఆఫర్లను ప్రయాణికులకు ఇస్తోంది.
టీఎస్ఆర్టీసీ
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 75 ఏళ్లు దాటిన వారికి.. ఉచిత రైడ్ సహా తొమ్మిది ఆకర్షణీయమైన ఆఫర్‌లను ప్రకటించింది. ప్రయాణికులు వాటిని ఉపయోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
'75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తొమ్మిది ఆఫర్లను ప్రకటించాం. ఈ తొమ్మిది ఆఫర్లను ఉపయోగించుకోండి.' అని TSRTC ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ సేవల కోసం ఆఫర్‌లను ప్రజలు పొందవచ్చని చెప్పారు.
1. 75 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులు ఆర్టీసీ బస్సులో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉచితంగా ప్రయాణించవచ్చు
2. T-24 టిక్కెట్లు ఒక్కొక్కరికి రూ.120 నుంచి రూ. 75కి అందిస్తారు. ఆగస్టు 15న జంట నగరాల్లో ప్రయాణం చేయోచ్చు. 24 గంటల టికెట్ చెల్లుబాటు అవుతుంది.
3. ఆగస్టు 15న పుట్టిన పిల్లలందరికీ 12 ఏళ్లు వచ్చే వరకు టీఎస్‌ఆర్‌టీసీ సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
4. టీటీడీ ప్యాకేజీలను పొందే ప్రయాణికులకు ఆగస్టు 16 నుండి 21 వరకు ప్యాకేజీపై రూ.75 తగ్గింపు లభిస్తుంది.
5. 75 కి.మీ దూరం వరకు బుక్ చేసిన 1 కిలో బరువున్న అన్ని పార్సిల్స్, సరకులు ఆగస్ట్ 15న ఉచితంగా తీసుకెళ్లచ్చు. ఛార్జ్ చేయరు.
6. ఒక సంవత్సరంలో ఆర్టీసీలో సుదూర ప్రయాణ చేసిన టాప్ 75 మంది సెలక్ట్ చేస్తారు. TSRTC వారి తదుపరి ట్రిప్‌లో ఉచిత టిక్కెట్‌ను అందిస్తుంది.
7. హైదరాబాద్ నుంచి విమానాశ్రయానికి పుష్పక్ ఎయిర్‌పోర్ట్ సర్వీస్‌ను ఉపయోగించే ప్రయాణికులు ఆగస్టు 15న ఛార్జీలో 75 శాతం మాత్రమే చెల్లించాలి.
8. ఆగస్ట్ 15 నుండి 22 వరకు తార్నాకలోని TSRTC హాస్పిటల్‌లో 75 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు, మందులు అందిస్తారు.
9. 75 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పౌరులకు ఔషధాలపై 75 శాతం తగ్గింపుతో ఒక్కరికి రూ. 750 ప్రత్యేక ఆరోగ్య ప్యాకేజీ అందిస్తున్నారు.
ఆర్టీసీ సేవలను ఉపయోగించుకునే ప్రయాణికులకు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ధన్యవాదాలు చెప్పారు. స్వతంత్ర భారత వజ్రోత్సవం ఉత్సవాల స్ఫూర్తితో ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు ఇస్తోందన్నారు. సేవలను ఆదరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ప్రజలు దేశభక్తిని పెంపొందించుకోవాలని కోరారు.