తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rachakonda Police: రాచకొండ కమిషనరేట్‌లో పెరిగిన క్రైమ్ రేట్…

Rachakonda Police: రాచకొండ కమిషనరేట్‌లో పెరిగిన క్రైమ్ రేట్…

HT Telugu Desk HT Telugu

28 December 2023, 8:08 IST

google News
    • Rachakonda Police: రాచకొండ సిపి సుధీర్ బాబు బుధవారం వార్షిక నేర నివేదికను విడుదల చేశారు.గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు

రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు

Rachakonda Police: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు.గత ఏడాదితో పోల్చితే 6.8 శాతం నేరాల సంఖ్య పెరిగిందని అయన తెలిపారు.గత ఏడాది 27,664 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య 29,166 కు చేరిందని సుధీర్ బాబు పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరిగాయని అయన వివరించారు

2 శాతం పెరిగిన రికవరీ రేట్

" చైన్ స్నా చింగ్,అత్యాచారం,సాధారణ దొంగతనాలు కేసులు రాచకొండ లో ఈ ఏడాది తగ్గాయి.చిన్నారులపై లైంగిక దాడుల కేసులు,హత్యలు,కిడ్నాప్ లు, గత ఏడాది కంటే పెరిగాయని వివరించారు.

ఈ ఏడాది డ్రగ్స్ కేసులో పోలీసులు 12 మంది పై పిడి ఆక్ట్ నమోదు చేశారు.282 డ్రగ్స్ కేసులో 698 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రాచకొండ పరిధిలో మొత్తం రూ.21.66 కోట్ల నగదు చోరీకి గురైతే అందులో రూ.12.77 కోట్లు పోలీసులు రికవరీ చేశారు.గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 2% రికవరీ రేట్ పెరిగింది " అని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.

16% పెరిగిన రోడ్డు ప్రమాదాలు

" కమిషనరేట్ పరిధిలో మొత్తం 16,599 కేసులు నమోదు అయ్యాయి.అందులో 2900 మంది డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు అయ్యాయి.ఈ ఏడాది రాచకొండ పరిధిలో మొత్తం 3321 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.అందులో 633 మంది మృతి చెందగా.....3,205 మందికి గాయాలు అయ్యాయి.గత ఏడాది తో పోల్చితే 16 శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగాయి.యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ద్వారా 56 కేసుల్లో మొత్తం 153 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సామాజిక మాధ్యమాల్లో వేధింపులపై వచ్చిన 8,758 ఫిర్యాదులలో 4,643 ఫిర్యాదులను పోలీసులు పరిష్కరించారని తెలిపారు.వేర్వేరు నేరాలకు సంబంధించి "20 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడింది. ఈ ఏడాది రాచకొండ లో మొత్తం సైబర్ నేరాలు 2,562 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.

మానవ అక్రమ రవాణా కేసులో 163 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని గేమింగ్ ఆక్ట్ పై 188 కేసులు నమోదు కాగా అందులో 972 మందిని అరెస్ట్ చేశారు " అని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు.

(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)

తదుపరి వ్యాసం