Adilabad Leaders: మా నాయకులు ఏ పార్టీలో ఉన్నారు?
02 November 2023, 6:05 IST
- Adilabad Leaders: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో భారీ మార్పులు జరుగుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది నాయకులు ఎప్పుడు ఏ పార్టీలోకి మారుతున్నారో తెలియకుండా పోతోంది. ఓ వైపు ప్రచారం ముమ్మురంగా కొనసాగుతూ ఉండడం మరోవైపు ఆ పార్టీ నేతలు వివిధ పార్టీలోకి మారడం సర్వసాధారణం అయిపోతుంది.
ఆదిలాబాద్‌లో నేతల పార్టీ మార్పులపై గందరగోళం
Adilabad Leaders: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియకుండా ఉంది. ఇంతకీ మా నాయకులు ఏ పార్టీలో ఉన్నారో చూసుకోవాల్సి వస్తోందని చలోక్తులు విసురుకుంటున్నారు.
బీఆర్‌ఎస్ టూ కాంగ్రెస్ టూ బీజేపీ...
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు 2014, 2018లో రెండుసార్లు బోథ్ శాసనసభ్యుడిగా బిఆర్ఎస్ తరఫున గెలిచారు. రాథోడ్ బాపురావుకు ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో అ దక్కకపోవడంతో ఆయన కొంత మనస్తాపం చెంది టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ అధిష్టానం రెండో జాబితాలో ఇతరులకు ఖరారు చేయడంతో బిజెపి నాయకులతో కలిసి బుధవారం ఢిల్లీకి వెళ్లి బిజెపి అగ్ర నేతల సమక్షంలో పార్టీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కమలం కండువా కప్పి బాపురావ్ ను పార్టీలో స్వాగతించారు. ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి సోయంబాపురావ్ ను గెలిపించి తీరుతానని, తాను పార్టీ మారినా క్యాడర్ తన వెంటే ఉందని పేర్కొన్నారు.
టిఆర్ఎస్ పార్టీలో కెసిఆర్ కు విధేయుడుగా ఉన్నప్పటికీ కొందరు నేతల నిర్వాకం వల్లే తనకు టికెట్టు దక్కకుండా పోయిందని అన్నారు. క్రమశిక్షణ కలిగిన బిజెపి పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని, తనకు అప్పచెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని , జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు.
బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి....
నిన్నటి వరకు బీజేపీ లో కీలకంగా వ్యవహరించిన చెన్నూర్ నియోజకవర్గం కి చెందిన జాతీయ స్థాయి నాయకుడు వివేక్ వెంకటస్వామి బిజెపి కి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గంట వ్యవధిలోనే బిజెపి పార్టీకి రాజీనామా సమర్పించి అమరుక్షణమే హైదరాబాదులో నోవాటెల్ హోటల్ లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఒకే రోజు ఆదిలాబాద్ జిల్లా నుండి మాజీ ఎంపీ వివేక్ బిజెపి వదిలి కాంగ్రెస్ లో చేరిపోగా సాయంత్రం ఢిల్లీలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు బిజెపిలో చేరడం ఆ పార్టీకి కాస్త ఓదార్పునిచ్చినట్టయింది.
జిల్లాలో బిజెపికి భారీ షాక్
ఉమ్మడి ఆదిలాబాద్ లో మంచిర్యాల జిల్లాలో బిజెపికి ఊహించని షాక్ తగిలింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఒకసారి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కమలంపార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి తనయుడు వివేక్ వెంకటస్వామి 2009లో పెద్దపెల్లి ఎంపీగా గెలిచారు, అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో బాల్క సుమన్ పై ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో కి, టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి, కాంగ్రెస్ నుండి బిజెపికి వెళ్లారు, ఎట్టకేలకు సొంతగూటికి చేరుకున్నారు.
బిజెపి మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆయన బుధవారం ఆకస్మాత్తుగా కమలం వేడి కాంగ్రెస్ పార్టీలో చేయడం సంచలనంగా మారింది. తండ్రి వివేక్ వెంకటస్వామి తనయుడుగా పేరు ఉండడంతో తండ్రి వైపు నుంచి వస్తున్న ఓటు బ్యాంకు ఇప్పటికీ చెదిరిపోలేదు. దీంతో ఇక్కడ చెన్నూర్ లో అధికార పార్టీ నుండి పోటీ చేస్తున్న బాల్క సుమన్ కు గట్టి పోటీ తప్పేట్టు లేదు. ht
రిపోర్టింగ్: కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి అదిలాబాద్