తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  World Heart Day 2023 : హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత గుండె పరీక్షలు - ఏ తేదీల్లో ఎక్కడంటే?

World Heart Day 2023 : హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత గుండె పరీక్షలు - ఏ తేదీల్లో ఎక్కడంటే?

HT Telugu Desk HT Telugu

27 September 2023, 19:51 IST

google News
    • World Heart Day 2023 : ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ లోని పలు ఆసుపత్రులు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాయి.
ఉచిత గుండె పరీక్షలు
ఉచిత గుండె పరీక్షలు (pixabay)

ఉచిత గుండె పరీక్షలు

World Heart Day 2023 : ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని పలు ఆస్పత్రులు ప్రజలకు ఉచితంగా చెకప్ లు, వివిధ రకాల టెస్టులు చేయనున్నట్టు ప్రకటించాయి.

బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో

బంజారాహిల్స్ లోని కేర్ హాస్పిటల్స్‌లో ఉచిత పీడియాట్రిక్ హార్ట్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించనున్నారు. రోగులు బరువు పెరగడం, పెదవులకు నీలం రంగు, నాలుక లేదా గోరు మచ్చలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎదుగుదల సరిగా లేకపోవడం, ఊపిరి ఆడకపోవడం వంటి వ్యాధులకు డాక్టర్లు చికిత్స చేయనున్నారు. ఈ క్యాంపు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహిస్తారు. ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత పీడియాట్రిక్ హార్ట్ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వీటితో పాటు ఉచిత 2D ECHO స్క్రీనింగ్‌ను కూడా చేస్తున్నట్లు ప్రకటించారు. మరిన్ని వివరాలు లేదా చెకప్ , రిజిస్ట్రేషన్ కోసం 9550318540 లేదా 040-61656565న నంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు.

కామినేనిలో ఉచిత గుండె పరీక్ష శిబిరం

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సెప్టెంబర్ 29వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్స్ లో ఉచిత గుండె పరీక్ష శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉచిత చెకప్‌లో ఈసీజీ, 2డీ ఎకో వంటి అవసరమైన రోగనిర్ధారణ పరీక్షలు చేస్తారు. కార్డియాలజిస్ట్‌తో సంప్రదింపులు కూడా చేసుకోవచ్చని ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు. యాంజియోగ్రామ్‌లు అవసరమయ్యే వ్యక్తులకు కూడా కామినేని హాస్పిటల్స్ సహాయాన్ని అందిస్తోందని కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలని సూచించారు.

అరుంధతి హాస్పిటల్‌లో అన్నీ రకాల వ్యాధులకు ఉచిత చికిత్స

మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి స్థాపించి నడుపుతున్న అరుంధతి హాస్పిటల్స్ ప్రతి ఒక్కరికి ఉచిత చికిత్సను అందిస్తోంది. హైదరాబాద్‌లోని దుండిగల్ సమీపంలోని గండి మైసమ్మలో ఈ ఆసుపత్రి ఉంది. రాజశేఖర్ రెడ్డి తన తల్లికి మాట ప్రకారం ఈ ఆసుపత్రిని స్థాపించారు. దుండిగల్‌లోని అరుంధతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్‌కి వెళ్లే ఎవరికైనా ఖరీదైన రోగ నిర్ధారణ, సంక్లిష్టమైన ఆపరేషన్లు ఉచితంగా చేస్తారు. మర్రి రాజశేఖర్ రెడ్డి తన తల్లికి ఇచ్చిన మాటకు ఫలితమే ఈ ఆసుపత్రి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ క్యాంపెయిన్ నుంచి ఈ ఆస్పత్రి స్ఫూర్తి పొందింది. అంబులెన్స్‌లను విరాళంగా ఇవ్వాలని, వారికి వీలున్న చోట వైద్య సదుపాయాలు కల్పించాలని పార్టీ క్యాడర్‌ను కేటీఆర్ ఇటీవలే కోరారు.

పేదలకు ఉచిత వైద్యం

మెడికల్ కాలేజీలు నిర్వహించే ఇతర ఆసుపత్రుల మాదిరిగా కాకుండా, ఇక్కడ ప్రతిదీ ఉచితం. పేదలకు ఎంత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తారు. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ , ఫార్మసీ కాలేజీలతో సహా మర్రి రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ఇతర విద్యాసంస్థల నుంచి ఈ ఆస్పత్రికి నిధులు సేకరిస్తున్నారు. గత మూడేళ్లలో దాదాపు 2.30 లక్షల మంది ఔట్‌ పేషెంట్లు సేవలు పొందారని, వివిధ విభాగాల ద్వారా 8 వేలకు పైగా శస్త్రచికిత్సలు జరిగాయని ఆసుపత్రి రికార్డులు వెల్లడిస్తున్నాయి. వీటిలో 3,000 పెద్ద శస్త్రచికిత్సలు, MRI, CT, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రఫీ, డిజిటల్ ఎక్స్-రే, EEG, EMG వంటి డయాగ్నోస్టిక్స్ డబ్బు తీసుకోకుండానే చేస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు ఈ సౌకర్యాలను రాయితీ ధరకు అందిస్తాయి, కానీ ఇక్కడ అన్నీ ఉచితం ప్రధానంగా పేషెంట్ల ద్వారానే మౌత్ పబ్లిసిటీ వల్ల ఫుట్‌ఫాల్ పెరుగుతోందన్నారు. కేవలం తెలంగాణ ప్రజలే కాకుండా బీహార్, ఉత్తరప్రదేశ్ నుండి వలసలు వచ్చిన వారు కూడా అధికంగా చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

తదుపరి వ్యాసం