తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Summer Holidays : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్, వేసవి సెలవులు ఎప్పటి నుంచంటే?

TS Summer Holidays : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్, వేసవి సెలవులు ఎప్పటి నుంచంటే?

26 March 2024, 22:30 IST

    • TS Summer Holidays : తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24 చివరి పనిదినం. దీంతో ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. వేసవి సెలవులపై విద్యాశాఖ అధికారిక ప్రకటన జారీ చేయాల్సి ఉంది.
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

TS Summer Holidays : తెలంగాణలో ఎండల తీవ్రత(Summer Heat) పెరుగుతుంది. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఎండల నేపథ్యంలో మార్చి 15 నుంచే రాష్ట్రంలో స్కూళ్లకు ఒంటి పూట బడులు మొదలయ్యాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు తెలంగాణలో ఒంటి పూట బడులు ఉంటాయి. ఏప్రిల్ 24 పాఠశాలలకు చివరి వర్కింగ్ డే గా తెలుస్తోంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 25 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు(TS Summer Holidays) ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై ఇంకా విద్యాశాఖ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హాలీడేస్?

రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒండి పూట బడులు(Half Day Schools) ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనం (Midday Meal)చేసిన తర్వాత విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవచ్చు. ఎండల తీవ్రత దృష్ట్యా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మంచి నీటి సదుపాయం ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు(TS Summer Holidays) ప్రకటించే అవకాశం ఉంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు విద్యాశాఖ ఆదేశాల మేరకు వేసవి సెలవులు అమలుచేయాలి. ప్రైవేట్ స్కూల్స్ లో తొమ్మిది పూర్తి చేసి పదో తరగతి(SSC Students) వెళ్లే విద్యార్థులకు స్పెషల్ క్లాస్ ల పేరిట తరగతులు నిర్వహిస్తున్నారు. ఇలా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని విద్యాశాఖ అధికారులు గతంలో తెలిపారు. మార్చి 18 నుంచి పదో విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ పరీక్షలు ముగుస్తాయి. అనంతరం పదో తరగతి విద్యార్థులకు సెలవులు ఉంటాయి. దీంతో పదోతరగతి విద్యార్థులకు 60కి పైగా రోజులు సెలవులు వస్తుంటాయి.

జూన్ 12 నుంచి స్కూళ్ల రీఓపెన్?

రాష్ట్రంలో ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు (TS Schools Summer Holidays)ఉండే అవకాశం ఉంది. జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రీఓపెన్(Schools Reopen) అవుతాయని అధికారులు అంటున్నారు. వేసవి సెలవులపై ప్రభుత్వ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ తెలిపింది. ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయని, విద్యార్థులు మధ్యాహ్నం పూట ఎండలో ఆటలు ఆడకుండా పేరెంట్స్ ఓ కన్నేసి ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తకుండా తరచూ మంచినీరు, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ తాగాలని సూచించారు.

తదుపరి వ్యాసం