తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Cabinet Meet : ఈ నెల 18న కేబినెట్ సమావేశం, కొత్త సచివాలయంలో తొలి భేటీ

TS Cabinet Meet : ఈ నెల 18న కేబినెట్ సమావేశం, కొత్త సచివాలయంలో తొలి భేటీ

16 May 2023, 21:46 IST

google News
    • TS Cabinet Meet : తెలంగాణ నూతన సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ ఈ నెల 18న జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గోనున్నారు.
సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (Twitter)

సీఎం కేసీఆర్

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. నూతన స‌చివాల‌యంలో గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధ్యక్షత‌న కేబినెట్ స‌మావేశం కానుంది. ఈ సమావేశంలో మంత్రుల‌తో పాటు ప‌లువురు ఉన్నతాధికారులు హాజ‌రుకానున్నారు. ఇది కొత్త స‌చివాల‌యంలో జరిగే తొలి కేబినెట్ స‌మావేశం కానుంది. ఈ కేబినెట్ స‌మావేశంలో పలు కీల‌క నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంది.

రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌, పార్లమెంటరీ పార్టీ సభ్యులు పాల్గోనున్నారు. ఈ సమావేశంలో జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ పదేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిపై పార్టీ నేతలకు వివరించనున్నారు.

21 రోజుల పాటు వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఉత్సవాలు తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాల ప్రారంభం కానున్నాయి. అదే రోజు మంత్రులు జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడతారు.

  • తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను మొత్తం 21 రోజుల పాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
  • హైదరాబాద్ లో జరిగే మొదటి రోజు కార్యక్రమాలను తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు సహా అన్ని శాఖల హెచ్వోడీలు ఉద్యోగులందరూ హాజరవుతారు.
  • అమర వీరులను స్మరించుకునేందుకు ఒకరోజును ప్రత్యేకంగా...మార్టియర్స్ డేగా జరుకోవాలి.
  • అమరుల స్మారక దినం సందర్భంగా...రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమరుల స్థూపాలను పుష్పాలతో అలంకరించి విద్యుత్తు దీపాలతో వెలిగించి, గ్రామ గ్రామాన తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ నివాళులు అర్పించాలి. జాతీయ జెండాను ఎగరవేసి వందనం సమర్పణ చేయాలి.
  • ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తూ తుపాకీ పేల్చి పోలీసులు అధికారికంగా గౌరవ వందనం చేస్తారు.
  • అన్ని జిల్లాల కలెక్టర్లు మార్టియర్స్ డే లో పాల్గొంటారు. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా అమరుల సంస్మరణ సహా ఉత్సవాల్లో పాల్గొంటాయి.
  • మరో ఇరవై రోజుల పాటు వరసగా ఆయా శాఖలు సాధించిన ప్రగతిని డాక్యుమెంటు రూపంలో ప్రదర్శించాలి.
  • వ్యవసాయం విద్యుత్తు.. ఇలా ప్రతీ శాఖ గురించిన డాక్యుమెంటరీని, ఆయా శాఖలకు కేటాయించబడిన రోజున, రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శిస్తారు.

తదుపరి వ్యాసం