తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Dasara Holidays : తెలంగాణ దసరా సెలవుల్లో మార్పులు, ఈ రోజుల్లో హాలీడేస్!

TS Dasara Holidays : తెలంగాణ దసరా సెలవుల్లో మార్పులు, ఈ రోజుల్లో హాలీడేస్!

07 October 2023, 18:11 IST

google News
    • TS Dasara Holidays : తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు చేసింది. అక్టోబర్ 23, 24 తేదీల్లో దసరా సెలవులుగా ప్రకటించింది.
దసరా సెలవుల్లో మార్పులు
దసరా సెలవుల్లో మార్పులు

దసరా సెలవుల్లో మార్పులు

TS Dasara Holidays : దసరా సెలవుల్లో తెలంగాణ ప్రభుత్వం మార్పు చేసింది. తాజాగా అక్టోబర్ 23, 24 తేదీల్లో సెలవులు ఉంటాయని ప్రకటించింది. ఇంతకు ముందు అక్టోబర్ 24, 25 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని సర్కార్ పేర్కొంది. ఇప్పుడు వాటిలో మార్పులు చేసింది. ఈ నెల 23న దసరా సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 24వ తేదీని సైతం సెలవుగా ప్రకటించింది. వాస్తవానికి దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధ నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ విద్వత్‌ సభ ఈ నెల 23న దసరా పండుగ నిర్వహించుకోవాలని తెలిపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం విజయదశమి సెలవులో మార్పు చేసింది.

స్కూళ్లకు 13 రోజుల సెలవులు

తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులతో పాటు, మిగతా వారికి అక్టోబర్ 23, 24 తేదీల్లో సెలవులు ఉంటాయని అధికారులు తెలిపారు. బతుకమ్మ పండుగ ప్రారంభం రోజున అంటే అక్టోబర్ 14న సాధారణ సెలవు ప్రకటించింది. అక్టోబర్ 22న దుర్గాష్టమి రోజున ఆప్షనల్ సెలవు ఇచ్చింది. దసరా పండుగ నేపథ్యంలో పాఠశాలలకు దాదాపు 13 రోజులు పాటు సెలవులు ప్రకటించింది. జూనియర్‌ కళాశాలలకు ఏడు రోజుల దసరా సెలవులు ప్రకటించింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకారం జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు సెలవులు ఉంటాయి. 26వ తేదీన కాలేజీలు తిరిగి తెరచుకోనున్నాయి. దసరా సెలవుల్లో జూనియర్ కాలేజీలకు ఎలాంటి స్పెషల్ క్లాసులు నిర్వహించకూడదని ఇంటర్‌ బోర్డు పేర్కొంది.

దసరా సెలవులు
తదుపరి వ్యాసం