తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Traffic Alert : వాహనదారులకు అలర్ట్... ఈ ప్రాంతాల్లో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Traffic Alert : వాహనదారులకు అలర్ట్... ఈ ప్రాంతాల్లో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

HT Telugu Desk HT Telugu

13 January 2024, 11:28 IST

google News
    • Hyderabad Traffic Alert : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విధించారు పోలీసులు. కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో… పలు మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు రూట్ మ్యాప్ ను విడుదల చేశారు. జనవరి 15వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ట్రాఫిక్ ఆంక్షలు
ట్రాఫిక్ ఆంక్షలు

ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Traffic Alert News: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ - 2024 సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి ఈనెల 15 వరకు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. వాహనదారులు ఆ మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా తీవోలి క్రాస్ రోడ్స్ నుండి ప్లాజా ఎక్స్ రోడ్ వరకు రొడ్డూను మూసివేస్తారని అయన తెలిపారు.

ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు....

ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయని అయన తెలిపారు. ఆలుగడ్డ బావి ఎక్స్ రోడ్స్, సంగీత ఎక్స్ రోడ్స్, YMCA ఎక్స్ రోడ్స్ , పాట్ని ,ఎస్బిఐ, ఉపకార జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్ క్రాస్ రోడ్స్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోయిన్పల్లి ఎక్స్ రోడ్స్ ,రసూల్ పురా, బేగంపేట్, ప్యారడైజ్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిపి విశ్వప్రసాద్ తెలిపారు. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ను తిలకించేందుకు ప్రజలు మెట్రో రైల్ సర్వీసులను ఉపయోగించుకోవాలని అయన కోరారు.ఫెస్టివల్ లో పాల్గొనేందుకు గ్రౌండ్ కు వచ్చే వారికోసం పరేడ్ గ్రౌండ్స్ లో కేటాయించిన పార్కింగ్ స్థలంలో వాహనాలను పార్కింగ్ చేయాలని ఆయన కోరారు.

హైదరాబాద్ లో మొదలైన సంక్రాంతి సందడి......

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతుళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు,రైల్వే స్టేషన్ లు కిటకిటలాడుతోంది......గంగిరెద్దుల తో హరిదాసులు ఇండ్ల ముందుకు వచ్చి సన్నాయి వాయిస్తూ పండుగ వాతావరణం తీసుకొచ్చారు ప్రాంతాల్లో ముగ్గుల ఫోటోలు జరుగుతుండగా మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు స్కూల్లో కాలేజీల్లో ముందస్తు భోగి సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. చిన్న పెద్దా కలిసి సంబరంగా గాలి పటాలను ఎగరస్తున్నారు.

ప్రస్తుతం సిటీలో కలర్ఫుల్ పతంగులతో సందడి వాతావరణం నెలకొంది.వీటితో పాటు కైట్ దుకాణాల్లో కూడా రద్దీగా మారాయి. దూల్ పేట, సికింద్రాబాద్, గుల్జార్ హౌస్ మరియు తదితర ప్రాంతాల్లోని కైట్ షాపులు అమ్మకాలు.... కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి .రూపాయి నుంచి 500 దాకా వివిధ రకాల పతంగులు లభిస్తున్నాయి.ప్రస్తుతం ట్రేడింగ్ లో ఉన్న ఉనిక్ కైట్ లను కొనేందుకు ఎక్కువమంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం