Big Breaking: నలుగురు TRS ఎమ్మెల్యేల ట్రాప్.. కొనుగోలుకు సిద్ధమైన జాతీయ పార్టీ?
26 October 2022, 22:41 IST
- police revealed the operation to buy trs MLAs: హైదరాబాద్ నగర పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. అధికార టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు.
తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్
police revealed the operation to buy trs MLAs: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో…. భారీ ఆపరేషన్ కు తెరలేపింది ఓ గ్యాంగ్. అధికార టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల(గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి)ను కొనుగోలు చేయటమే ఈ ఆపరేషన్ లక్ష్యమని సమాచారం. ఒక్కొ ఎమ్మెల్యేకు వంద కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
మెయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ లో చర్చలు జరుపుతుండగా పోలీసులు రైడ్ చేశారు. భారీగా నగదుతో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఢిల్లీకి చెందిన వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. దీని వెనక ఓ జాతీయ పార్టీ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చారు..
ఇందుకు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకు రైడ్ చేశామని చెప్పారు. డబ్బులతో పాటు కాంట్రాక్ట్ లు ఇస్తామని ప్రలోభాలు పెడుతున్నారంటూ చెప్పారు వెల్లడించారు. ఈ మేరకు మెయిన్ బాద్ లోని ఫౌమ్ హౌజ్ పై తనిఖీలు చేయగా... ముగ్గురు వ్యక్తులు దొరికారని తెలిపారు. వీరిలో రామచంద్రభారతి, సింహయాజులు, సతీశ్ శర్మ ఉన్నారని పేర్కొన్నారు. వీరిని హైదరాబాద్ కు చెందిన నందకుమార్ అనే వ్యక్తి రప్పించారని సీపీ వెల్లడించారు. ఫౌమ్ హౌజ్ వేదికగా ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రాథమికంగా వెల్లడైందని చెప్పారు. రామచంద్రభారతి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోందన్న ఆయన... విచారణ తర్వాత పూర్తి స్థాయిలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.
మా ఎమ్మెల్యేలకు సెల్యూట్ - బాల్క సుమన్
ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు ఆఫర్ చేసిందని చెప్పారు. కానీ వాటిని తిరిస్కరించి ఈ వ్యవహరాన్ని బట్టబయలు చేశారని తెలిపారు. తమ ఎమ్మెల్యేలకు సెల్యూట్ చేస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రలోభాల పేరుతో బీజేపీ చిల్లర వేషాలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేసిన కుట్రను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటపెట్టారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తిని కొనుగోలు చేయవచ్చు కానీ… ఉద్యమకారులైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనలేరని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజీపీ కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలంతా బీజేపీ అరాచకాలను గమనించాలని కోరారు. వచ్చే మునుగోడు ఎన్నికలో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ వ్యవహరంపై సమగ్ర విచారణ జరిపి అసలు విషయాలను బయటికి లాగాలని పోలీసులను కోరారు.
టాపిక్