తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Solar Cycling Track | ఇకపై ఓఆర్ఆర్ ఎక్కనున్న సైకిళ్లు.. సోలార్ సైక్లింగ్ ట్రాక్

Solar Cycling Track | ఇకపై ఓఆర్ఆర్ ఎక్కనున్న సైకిళ్లు.. సోలార్ సైక్లింగ్ ట్రాక్

HT Telugu Desk HT Telugu

29 May 2022, 14:36 IST

    • ఓఆర్ఆర్ అంటే.. రయ్.. రయ్ అంటూ వెళ్లే వాహనాలే కనిపిస్తాయి. కానీ ఇకపై సైకిల్స్ కూడా.. ఓఆర్ఆర్ ఎక్కనున్నాయి. ఎందుకు అంటారా?
సోలార్ సైక్లింగ్ ట్రాక్
సోలార్ సైక్లింగ్ ట్రాక్

సోలార్ సైక్లింగ్ ట్రాక్

సైక్లిస్టులు కూడా ఇకపై ఓఆర్ఆర్ ఎక్కొచ్చు. అదేంటి.. టూ వీలర్స్ ను కూడా ఓఆర్ఆర్ మీదకు రానివ్వరు కదా అనుకుంటున్నారా? ఇకపై సైకిల్స్ ను మాత్రం రానిస్తారు. అది కూడా 21 కిలో మీటర్ల దూరం. ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై సైక్లిస్టుల కోసం ప్రత్యేక ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Mlc Dande Vithal : ఎమ్మెల్సీగా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు, సుప్రీంలో సవాల్ చేస్తానంటోన్న దండే విఠల్

Koheda Gutta ORR : ఓఆర్ఆర్ పక్కనే ఉన్న కోహెడ గుట్టను చూసొద్దామా..! వ్యూపాయింట్ అస్సలు మిస్ కావొద్దు

Rohith Vemula Case : రోహిత్ వేముల దళితుడు కాదు..! హైకోర్టులో కేసు క్లోజ్ రిపోర్ట్ దాఖలు

Guinness World Record : కేవలం 2.88 సెకన్లలోనే 'Z నుంచి A' వరకు టైపింగ్ - గిన్నిస్‌ రికార్డు సాధించిన హైదరాబాదీ

హైద‌రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్డును అనుస‌రిస్తూ అత్యంత ఆధునిక సౌకర్యాలతో 21 కి.మీ సోలార్ సైకిల్ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. నానక్‌రామ్‌గూడ నుంచి తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (టీఎస్‌పీఏ) వరకు 8 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 13 కిలోమీటర్ల మేర ఈ ట్రాక్‌ విస్తరిస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) వింగ్ అయిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) ద్వారా 4.5 మీటర్ల సైకిల్ ట్రాక్‌ను చేపట్టనున్నారు,

ఈ ట్రాక్.. మూడు సైకిల్ లేన్‌లను కలిగి ఉంటుంది. ఇరువైపులా ఒక మీటర్ గ్రీన్ స్పేస్ ఉంటుంది. పార్కింగ్ స్థలాలు, నిఘా కెమెరాలు, సైకిల్ డాకింగ్, ఫుడ్ కోర్టులు, తాగునీరు, విశ్రాంతి గదులు, ప్రాథమిక సైకిల్ రిపేర్ షాపులతో సహా సైక్లిస్టుల కోసం అనేక సౌకర్యాలతో ట్రాక్ లు ఉంటాయి. దక్షిణ కొరియాలోని సైక్లింగ్ ట్రాక్ ప్రేర‌ణ‌తో దీన్ని నిర్మిస్తున్నారు. సైకిల్ ట్రాక్ సోలార్ రూఫింగ్ ద్వారా దాదాపు 9MW శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. దానిని ORR లైటింగ్, డ్రిప్ ఇరిగేషన్, ORRతో స‌హా ఇతర విద్యుత్ అవసరాల కోసం HGCL ఉపయోగించుకుంటుంది.

సోలార్ కవర్ రూఫింగ్ కూడా ఉంటుంది. సర్వీస్ రోడ్డు, ప్రధాన క్యారేజ్‌వే మధ్య సైక్లిస్టుల కోసం ట్రాక్‌లు వేస్తారు. ఈ సదుపాయం సైక్లిస్టులకు ఎండ, వర్షం, ఇతర వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణను కల్పిస్తుంది. అంతేకాకుండా వారికి ప్రయాణ భద్రత కూడా ఉంటుంది.

అనేక సౌకర్యాలతో ట్రాక్ వస్తుంది. అదనంగా, పగటిపూట, రాత్రి సమయంలో ట్రాక్‌పై మంచి వెలుతురు ఉండేలా మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చేస్తారు. లైటింగ్ కోసం విద్యుత్ అవసరాన్ని సోలార్-ప్యానెల్ పైకప్పు నుండి ఉత్పత్తి చేస్తారు.

9MW విద్యుత్ ఉత్పత్తి

సైకిల్ ట్రాక్ సోలార్ రూఫింగ్ ద్వారా దాదాపు 9MW విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. దానిని ORR లైటింగ్, డ్రిప్ ఇరిగేషన్ మరియు ORR ఇతర విద్యుత్ అవసరాల కోసం HGCL ఉపయోగించుకుంటుంది. నార్వేజియన్ పర్యావరణవేత్త, గ్రీన్ బెల్ట్ రోడ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు ఎరిక్ సోల్హీమ్ ట్వీట్ చేసిన దక్షిణ కొరియాలోని సైక్లింగ్ ట్రాక్ వీడియో ఈ ప్రాజెక్ట్ వెనక ఆలోచన. మంత్రి కేటీఆర్ ఈ ఆలోచనను ఓఆర్‌ఆర్‌పై అమలు చేయాలని ప్రతిపాదించారు.