TS Staff Nurse Jobs : తెలంగాణలో కొత్తగా 1890 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ, రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
17 December 2023, 15:45 IST
- TS Staff Nurse Notification : తెలంగాణలో కొత్తగా 1890 స్టాఫ్ నర్సుల పోస్టులు భర్తీ చేయనున్నారు. గతంలో ఇచ్చిన 5204 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కు అదనంగా 1890 కలిసి పోస్టులను భర్తీ చేయనున్నారు.
స్టాఫ్ నర్సుల పోస్టులు
స్టాఫ్ నర్సుల పోస్టులు
TS Staff Nurse Notification : తెలంగాణలో కొత్తగా 1890 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్ లో 5204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. వీటికి 1890 పోస్టులను కలిసి మొత్తం 7094 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొత్తం పోస్టుల్లో మూడో వంతు మహిళలతో భర్తీ చేయనున్నారు.
- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్, వైద్యవిద్యాసంచాలక పరిధిలో- 5,650 పోస్టులు
- వైద్యవిధాన పరిషత్ పరిధిలో -757 పోస్టులు
- ఎంఎన్‌జే ప్రాంతీయ క్యాన్సర్ ఆసుపత్రిలో - 81 పోస్టులు
- దివ్యాంగుల సంక్షేమశాఖ పరిధిలో - 8 పోస్టులు
- మైనారిటీ గురుకుల విద్యాలయాల పరిధిలో - 127 పోస్టులు
- బీసీ గురుకుల సంస్థ పరిధిలో - 260 పోస్టులు
- గిరిజన గురుకుల సంస్థ పరిధిలో- 74 పోస్టులు
- ఎస్సీ గురుకుల సంస్థ పరిధిలో -124 పోస్టులు
- తెలంగాణ గురుకుల సంస్థ పరిధిలో -13 పోస్టులు
జోన్ల వారీగా
- జోన్ 1 పరిధిలో- 937 పోస్టులు
- జోన్ 2 పరధిలో - 1044 పోస్టులు
- జోన్ 3 పరిధిలో -1023 పోస్టులు
- జోన్ 4 పరిధిలో -719 పోస్టులు
- జోన్ 5 పరిధిలో - 1305 పోస్టులు
- జోన్ 6 పరిధిలో -948 పోస్టులు
కేటగిరీల ప్రకారం పోస్టుల భర్తీ
- ఓసీ కేటగిరీ -2110
- ఈడబ్ల్యూఎస్ -653
- బీసీ(ఎ) -612
- బీసీ(బి) -686
- బీసీ(సి)- 81
- బీసీ(డి)- 466
- బీసీ(ఈ) -330
- ఎస్సీ -1041
- ఎస్టీ -690
- స్పోర్ట్స్ కోటా- 114
- దివ్యాంగుల కోటా- 311 పోస్టులు
సీసీఎంబీలో ఉద్యోగాలు
హైదరాబాద్ లోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) నుంచి ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలైంది. జూనియర్ స్టెనోగ్రాఫర్, టెక్నిషియన్, టెక్నికల్ అస్టిసెంట్, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది.
ముఖ్య వివరాలు
- ఉద్యోగ ప్రకటన - సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్
- మొత్తం ఉద్యోగాలు - 69
- భర్తీ చేసే ఉద్యోగాలు - జూనియర్ స్టెనోగ్రాఫర్ (5),టెక్నిషియన్(40), టెక్నికల్ అసిస్టెంట్ (18, టెక్నికల్ ఆఫీసర్(5), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (01)
- అర్హతలు - ఆయా పోస్టులను అనుసరించి అర్హతలు ఉంటాయి. అధికారిక వెబ్ సైట్ లోని పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వివరాలు చూసుకోవచ్చు.
- దరఖాస్తులు - ఆన్ లైన్
- దరఖాస్తులు ప్రారంభం - 20, డిసెంబర్, 2023
- దరఖాస్తులకు తుది గడువు - 20, జనవరి, 2024.
- జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు చివరి తేదీ - 29 జనవరి, 2024
- అధికారిక వెబ్ సైట్ - https://www.ccmb.res.in/