తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Mla Meets Cm Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ, కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ!

BRS Mla Meets CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ, కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ!

HT Telugu Desk HT Telugu

28 January 2024, 22:19 IST

google News
    • BRS Mla Meets CM Revanth Reddy : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశానని, కాంగ్రెస్ లో చేరడంలేదని ప్రకాష్ గౌడ్ అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

BRS Mla Meets CM Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ వెళ్లారు. ఆదివారం సీఎంతో ఆయన మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ప్రస్తుతం వీరి భేటీ రాష్ట్ర రాజకీయ వర్గలో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ ను కలవడం వెనుక అంతర్యం ఏంటని రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. ఇటీవల నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి... దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. అందులోనూ మాజీ మంత్రి హరీశ్ రావుకు అత్యంత సన్నిహితుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి రేవంత్ అపాయింట్మెంట్ తీసుకోవడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇదిలా ఉంటే తాము మర్యాదపూర్వకంగానే సీఎంను కలిసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇవ్వడంతో అనుమానాలకు ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ సింగిల్ గా సీఎం కలవడం ఇంటరెస్టింగ్ గా మారింది.

ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అగ్రనాయకులు కేటీఆర్, హరీశ్ రావు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కార్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరిపేందుకు రెడీ అయ్యారు. అక్రమాలు నిజమని తేలితే బీఆర్ఎస్ నాయకులు జైలుకే అంటూ మంత్రులు, కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి భేటీ ప్రాధాన్యత సంచరించుకుంది.

కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం

అయితే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. తన నియోజకవర్గం రాజేంద్రనగర్, శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ, బహదూర్ గూడా, ఘన్సిమియా గూడా గ్రామాలలో ఉన్న భూసమస్యలు పరిష్కారం చూపాలని అలాగే నియోజకవర్గం అభివృద్ధికి ప్రతేక నిధులు మంజూరు చేయాలని కోరేందుకు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యాయని ప్రకాష్ గౌడ్ అన్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ప్రకాష్ గౌడ్ అన్నారు.

బీఆర్ఎస్ ను వీడాలనుకునే వారు వెళ్లొచ్చు- కేటీఆర్

సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీని వీడాలనుకునే వారు వెళ్లొచ్చని....వారి స్థానంలో తాము కొత్త నాయకులను తయారు చేస్తామని అన్నారు. అమ‌లు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింద‌ని కేటీఆర్ తెలిపారు. రూ. 2 ల‌క్షల రైతు రుణ‌మాఫీ చేయ‌లేదు. రైతుబంధు కింద వారం రోజుల్లోనే రూ. 7,500 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఘ‌న‌త కేసీఆర్ దేనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది.. కరెంట్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయని ఆరోపించారు. తెలంగాణ తెచ్చింది గులాబీ జెండానే. పోయింది అధికారం మాత్రమే...పోరాట ప‌టిమ కాదన్నారు. ప్రజ‌ల పక్షాన ప్రశ్నించ‌డంలో కేసీఆర్ కంటే ప‌దునైన గొంతు ఈ దేశంలో లేదని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రజ‌లు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని ఆయన దిల్లీ మేనేజ్‌మెంట్ కోటా సీఎం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వ‌చ్చేదా? తెలంగాణ రాకుంటే సీఎం, డిప్యూటీ సీఎం ప‌ద‌వులు మీకు ద‌క్కేవా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప‌లికేవ‌న్నీ ప్రగ‌ల్భాలే....ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను త‌ప్పించుకునేందుకు రోజుకో అవినీతి క‌థ అల్లుతున్నారన్నారు. ఇక్కడ అవినీతి....అక్కడ అవినీతి అని క‌థ‌లు చెబుతున్నారు. అధికారం కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది....అవినీతి జరిగితే బయటకు తియ్యండన్నారు.

అవినీతి జ‌రిగిన‌ట్లు తేలితే బాధ్యుల‌పై చ‌ర్యలు తీసుకోవాలని కేటీఆర్ సవాల్ చేశారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా త‌ప్పించుకుంటే వ‌దిలిపెట్టం అని హెచ్చరించారు.అధికారంలోకి వ‌స్తామ‌ని కాంగ్రెస్ కూడా న‌మ్మలేదన్నారు. డిక్లరేష‌న్ల పేరుతో ప్రజ‌ల‌ను మోసం చేశారన్నారు. కేసీఆర్ చెప్పిందే నిజ‌మైంద‌ని ప్రజ‌లు భావిస్తున్నారాన్నారు. ఉచిత బ‌స్సు ప‌థ‌కంతో ఆటో డ్రైవ‌ర్ల బ‌తుకులు ఆగం అయ్యాయన్నారు. ఫ్రీ బ‌స్సు ప‌థ‌కంతో బ‌స్సుల్లో యుద్ధాలు జ‌రుగుతున్నాయన్నారు. ఏదైనా ప‌థ‌కం తెస్తే ఆలోచించి తేవాలన్నారు. గ‌వ‌ర్నర్ ప్రసంగం అంతా అబ‌ద్దాల పురాణమేనని విమర్శించారు. శ్వేత‌ప‌త్రం పెడితే... ధీటుగా జ‌వాబిచ్చామన్నారు. కేసీఆర్ ప్రతిప‌క్షంలో ఉంటేనే ప‌వ‌ర్ ఫుల్అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ములాఖ‌త్ అయ్యాయని ఆరోపించారు. సిరిసిల్ల నేత‌న్నల‌కు బీఆర్ఎస్ అండ‌గా ఉంటుందని కేటీఆర్ భ‌రోసా ఇచ్చారు.

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం