తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Double Bed Room Houses : డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే గోపీనాథ్ మోసం చేశారు- బాధితుల ఆరోపణ

Double Bed Room Houses : డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే గోపీనాథ్ మోసం చేశారు- బాధితుల ఆరోపణ

HT Telugu Desk HT Telugu

19 November 2023, 16:25 IST

google News
    • Double Bed Room Houses : జూబ్లీహిల్స్ కమలానగర్ లో డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని బాధితులు వాపోతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని... ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తమను మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు

Double Bed Room Houses : హైదరాబాద్ జూబ్లీహిల్స్ కమలానగర్ లో డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం నెలకొంది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 130 కుటుంబాల ఇండ్లను ముందుగా ఖాళీ చేయించారని, ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాక 130 కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. తీరా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరులకే ఇచ్చుకున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

ఎమ్మెల్యే మోసం చేశారు- బాధితులు

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హామీతోనే తాము సొంత ఇండ్లు ఖాళీ చేసి అద్దె ఇంట్లో ఉంటున్నామని బాధితులు తెలిపారు. ఇప్పుడు 100 మంది ఎమ్మెల్యే అనుచరులకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చుకున్నారని, కేవలం 30 మంది అర్హులకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇండ్లు దక్కాయని బాధితులు వాపోతున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తమను నమ్మించి మోసం చేశారని బాధితులు మండిపడుతున్నారు. ఇండ్లు దక్కిన ఆ 30 మంది కూడా అనేక సమస్యలతో బాధపడుతున్నారని బాధితులు తెలిపారు. నాసిరకం నిర్మాణం వల్ల తాము అదనంగా రూ.3 లక్షలు పెట్టి మరమ్మతులు చేయించుకోవాల్సి వచ్చిందని లబ్దిదారులు చెబుతున్నారు. డ్రైనేజి లీక్, ఫ్లోర్ కు గుంతలు, గోడలకు పగుళ్లు వంటి అనేక సమస్యలు ఉన్నాయని లబ్దిదారులు చెబుతున్నారు.

100 ఇండ్లు ఖాళీగా ఉన్నా

నీరు,కరెంట్ వంటి కనీస సదుపాయాలు కూడా డబుల్ బెడ్రూం ఇళ్లలో ఉండడం లేదని లబ్దిదారులు అంటున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టామని చెప్పుకోవడమే తప్ప...ఏమాత్రం నాణ్యత మెటీరియల్ వాడకుండా కడుతున్నారని ఆరోపించారు. సమస్యలు మీడియాతో పంచుకుంటే బెదిరింపులకు గురి చేస్తున్నారని లబ్దిదారులు చెబుతున్నారు. కమలానగర్ లో 100 వరకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఖాళీగా ఉన్నాయని, ఇండ్లు లేక వేల పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే ఆ 100 ఇండ్లను ఎవ్వరికీ కేటాయించకుండా ప్రభుత్వం, ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహిస్తున్నారని కమలానగర్ వాసులు అంటున్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

తదుపరి వ్యాసం