తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad News : దీపావళి ఎఫెక్ట్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి బాధితులు క్యూ!

Hyderabad News : దీపావళి ఎఫెక్ట్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి బాధితులు క్యూ!

HT Telugu Desk HT Telugu

13 November 2023, 19:58 IST

google News
    • Hyderabad News : హైదరాబాద్ లోని సరోజినీ  దేవి కంటి ఆసుపత్రిలో 60 మంది కంటి గాయాలతో చేరారు. దీపావళి టపాసులు కాల్చే సమయంలో వీరు గాయపడ్డారు.
సరోజినీ దేవీ కంటి ఆసుపత్రి
సరోజినీ దేవీ కంటి ఆసుపత్రి

సరోజినీ దేవీ కంటి ఆసుపత్రి

Hyderabad News : దీపావళి పండుగ వచ్చిందంటే యువతీ యువకులతో పాటు చిన్న పిల్లలు కూడా టపాసులు కాల్చేందుకు సంబరపడతుంటారు. కానీ టపాసులు కాల్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పలు ప్రమాదాలకు దారి తీస్తాయి. ముఖ్యంగా చాలా మందికి కంటి గాయాలు అవుతూ ఉంటాయి. ఈసారి కూడా అదే జరిగింది.

50 మంది పిల్లలకు కంటి గాయాలు

టపాసులు కాల్చేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నగరంతో పాటు నగర శివారులో కనీసం 60 మందికి కంటి గాయాలు అయ్యాయి. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు 60 మంది కంటి గాయాలతో సరోజినీ దేవి కంటి దవాఖానకు వచ్చారని వైద్యులు వెల్లడించారు. అయితే వారిలో 45 మంది చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వెళ్లగా మిగతా అయిదుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారికి వైద్యులు ఆపరేషన్ చేశారు. కాగా వీరిలో ఎక్కువ శాతం 10- 17 సంవత్సరాల వయసు లోపు వారే గాయపడ్డట్టు వైద్యులు ప్రకటించారు. హైదరాబాద్ పోలీసులు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే టపాసులు కాల్చాలని, బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై టపాసులు కల్చవద్దని ఆదేశాలు ఇచ్చినా కొందరు రాత్రంతా సోమవారం ఉదయం వరకు కూడా పేల్చారు.

ముషీరాబాద్ లో బాణాసంచా పేల్చే విషయంలో ఘర్షణ

ముషీరాబాద్ బొలక్ పూర్ లో ఆదివారం దీపావళి సందర్భంగా బాణసంచా పేల్చే విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బొలక్ పూర్ లో నివాసం ఉంటున్న అబ్దుల్ అరాఫత్ (19) ఇంటి ముందు కొందరు పిల్లలు టపాసులు కాల్చి విసేరెస్తుండడంతో అతడు అభ్యంతరం చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన శివ, రమేష్, సునీల్, రాజేష్ అబ్దుల్ ఇంటిపై రాళ్లు రువ్వి కర్రలతో దాడి చేశారు. ఇటు అబ్దుల్ అరాఫత్ సైతం తన బంధువులు, స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా శివ గ్యాంగ్ పై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

తదుపరి వ్యాసం