తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Minister Mallareddy : మాది రాజకీయ పార్టీ, ఎట్లైనా ఎన్నికల స్టంట్ ఉంటాయ్, ఆర్టీసీ విలీనంపై నోరుజారిన మంత్రి మల్లారెడ్డి

Minister Mallareddy : మాది రాజకీయ పార్టీ, ఎట్లైనా ఎన్నికల స్టంట్ ఉంటాయ్, ఆర్టీసీ విలీనంపై నోరుజారిన మంత్రి మల్లారెడ్డి

07 August 2023, 14:04 IST

google News
    • Minister Mallareddy On TSRTC : ఆర్టీసీ విలీనంపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. విలేఖరి అడిన ప్రశ్నకు స్పందిస్తూ... మాది రాజకీయ పార్టీ ఎట్లైనా ఎన్నికల స్టంట్ ఉంటుందన్నారు.
మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి

Minister Mallareddy On TSRTC : టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంపై టీఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. టీఎస్ఆర్టీసీ కార్మికులకు డబుల్ కా మీటా ఇచ్చామన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఊహించని విధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ చేశారన్నారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి పాలాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడినప్పుడు మంత్రి మల్లారెడ్డి నోరుజారారు. ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు.... ఎన్నికల స్టంట్ అనుకో, ఏదైనా అనుకోండి. మాది రాజకీయ పార్టీ ఎన్నికలకు వెళ్తున్నాం, ఎట్లైనా ఎన్నికల స్టంట్ ఉంటాయని మంత్రి అన్నారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎన్నికల సమీపిస్తుండడంతో అన్ని వర్గాలపై సీఎం కేసీఆర్ వరాలు కురిపిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు కుదరదని చెప్పిన కేసీఆర్...ఎన్నికల స్టంట్ గా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

మాది రాజకీయ పార్టీ...ఎన్నికల స్టంట్ ఉంటుంది

ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు అవుతామని కలలో కూడా ఊహించ ఉండరని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు మన బిడ్డలే, మన కార్మికులే అని చెప్పిన కేసీఆర్... వారికి డబుల్ కా మీటా, డబుల్ ధమాకా ఇచ్చారన్నారు. కార్మికులు ఎప్పటికీ ఆర్టీసీలోనే ఉంటామని అనుకున్నారని, ఇవ్వాల అందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వంలో కలుపుకుంటున్నామన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ... మాది రాజకీయ పార్టీ, ఎన్నికల స్టంట్ ఎలాగైనా ఉంటుంది. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగిందా లేదా? వాళ్ల భవిష్యత్తు మంచిగా అయిందా లేదా? ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయా లేదా? అన్నారు. ఈ నిర్ణయం తీసుకోవాలంటే ఎంత దిల్, ధైర్యం కావాలి. ఎన్ని నిధులు కావాలి. అది కేసీఆర్ కు మాత్రమే సాధ్యం అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

వర్షాకాల సమావేశాల్లో బిల్లు

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసినా కార్పొరేషన్‌ అలాగే ఉంటుందని ఆ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. టీఎస్‌ఆర్టీసీ అలాగే ఉంటుందని, దానికి ఛైర్మన్‌, ఎండీ కొనసాగుతారని వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేసిందన్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో విలీనం బిల్లును ప్రవేశపెడతామని ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు.

తదుపరి వ్యాసం