తెలుగు న్యూస్  /  ఫోటో  /  Uppal Skywalk : ఉప్పల్ స్కైవాక్ వంతెనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Uppal Skywalk : ఉప్పల్ స్కైవాక్ వంతెనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

26 June 2023, 14:49 IST

Uppal Skywalk : హైదరాబాద్ ఉప్పల్‌ కూడలిలో హెచ్ఎండీఏ నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు. కాలినడకన రోడ్డు దాటేవారి కోసం హెచ్‌ఎండీఏ రూ.36.5 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించింది. 660 మీటర్ల మేర స్కైవాక్‌ ఏర్పాటు చేశారు.

  • Uppal Skywalk : హైదరాబాద్ ఉప్పల్‌ కూడలిలో హెచ్ఎండీఏ నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు. కాలినడకన రోడ్డు దాటేవారి కోసం హెచ్‌ఎండీఏ రూ.36.5 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించింది. 660 మీటర్ల మేర స్కైవాక్‌ ఏర్పాటు చేశారు.
ఉప్పల్ స్కైవాక్ వంతెన
(1 / 9)
ఉప్పల్ స్కైవాక్ వంతెన
హైదరాబాద్‌లో రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్‌ చౌరస్తాలో పాదచారులు రోడ్డు దాటేందుకు హెచ్ఎండీఏ స్కైవాక్ టవర్ నిర్మించింది. ఈ స్కైవాక్‌ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 
(2 / 9)

ఉప్పల్ స్కైవాక్ వంతెనపై మంత్రి కేటీఆర్ 
(3 / 9)
ఉప్పల్ స్కైవాక్ వంతెనపై మంత్రి కేటీఆర్ 
665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్‌ వెడల్పు, 6 మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్‌ను కలుపుతూ స్కైవాక్‌ను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్‌లు,4 ఎస్కలేటర్స్‌, 6 చోట్ల మెట్ల సౌకర్యం కల్పించారు. 
(4 / 9)

నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీస్ స‌మీపంలోని వ‌రంగ‌ల్ బ‌స్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేష‌న్, ఉప్పల్ ఎల‌క్ట్రిక‌ల్ స‌బ్‌స్టేష‌న్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. 
(5 / 9)

నాలుగు వైపుల నుంచి ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులతో పాటు మెట్రో స్టేషన్‌కు స్కైవాక్ వంతెనను అనుసంధానించారు. మెట్లు ఎక్కలేని వారికోసం ఎస్కలేటర్లు, లిఫ్టుల సౌకర్యం కూడా కలదు. 
(6 / 9)

స్కైవాక్‌ పైన, కింద, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ కూడా ఉంటుంది. 
(7 / 9)

స్కైవాక్ లో ఎల్‌ఈడీ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పైన కూడా ఎండ తగల కుండా ఉండేందుకు రూఫ్‌లను ఏర్పాటుచేశారు.   
(8 / 9)

ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రూ.36.50 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండీఏ స్కైవాక్ టవర్ ను నిర్మించింది. రోడ్డు దాటే అవసరం లేకుండా ఎటువైపు అయినా వెళ్లేందుకు దీనిని నిర్మించారు. 
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి