తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో మరో రికార్డు, ఒకే రోజు 5.47 లక్షల మంది రాకపోకలు

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో మరో రికార్డు, ఒకే రోజు 5.47 లక్షల మంది రాకపోకలు

HT Telugu Desk HT Telugu

07 November 2023, 14:16 IST

    • Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ పెరుగుతోంది. నగరంలోని మూడు కారిడార్ లలో ఒకే రోజు 5.47 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇది సరికొత్త రికార్డు అని మెట్రో అధికారులు అంటున్నారు.
హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్ మెట్రో

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతుంది. ఒక్క రోజులో ప్రయాణం చేసే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరింది. ఒకే రోజు 5.47 లక్షల మంది ప్రయాణికులు నగరంలోని మూడు కారిడార్ లలో ఉన్న మెట్రో మార్గాల్లో రాకపోకలు సాగించారు.

ట్రెండింగ్ వార్తలు

20 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Karimnagar Politics: కరీంనగర్‌ల ఫ్లెక్సీల కలకలం, పార్టీ ఫిరాయింపు దారులకు వార్నింగ్‌లతో కూడిన ఫ్లెక్సీలు

Warangal Murder: ఆస్తి కోసం వృద్ధుడి దారుణ హత్య! కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు, వరంగల్‌లో ఘోరం

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

ఒక్క రోజులో 5.47 లక్షల ప్రయాణికుల రాకపోకలు

మెట్రో సేవలు ప్రారంభం అయి ఆరేళ్లలో ఒక్క రోజు దాదాపు 5.47 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో రాకపోకలు సాగించడం సరికొత్త రికార్డు అని పేర్కొన్నారు హైదరాబాద్ మెట్రో అధికారులు. నగరంలో అత్యంత కీలకమైన మార్గాల్లో మెట్రో సేవలు ఉండడంతో ప్రతీ సంవత్సరం రద్దీ గణనీయంగా పెరుగుతూ వస్తుంది. కరోనా ప్రభావం చూపినా క్రమంగా మెట్రో రైళ్ల రద్దీ పెరుగుతుండడంతో దానికి అనుగుణంగా మెట్రో అధికారులు రైళ్లను ఆయా మార్గాల్లో నడుపుతూ ఉన్నారు.

కారిడార్ - 3లో రద్దీ అధికం

హైదరాబాద్ మహానగరంలో ఐటీ కార్యలాపాలతో పాటు దసరా, దీపావళి సీజన్ కావడంతో ప్రయాణికుల రద్దీ తీవ్రత పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీల కార్యకలాపాలు ఉండే సోమవారం నుంచి శుక్రవారం వరకు కారిడార్ -3 లో రద్దీ ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇక మెట్రోలో ప్రయాణం చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని, సురక్షితంగా, వేగవంతంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చన్నారు. అందుకే ఐటీ ఉద్యోగులు ఎక్కువ శాతం మెట్రోలోనే ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారని మెట్రో అధికారులు వెల్లడించారు.

ప్రస్తుత మార్గాలు

హైదరాబాద్ మెట్రో సేవలను 2017లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. కాగా ఈ ప్రాజెక్టును దశల వారీగా అమలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం మూడు లేన్లలో( రెడ్,గ్రీన్,బ్లూ) ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. రెడ్ లెన్ మార్గం మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు సుమారు 29 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ మార్గంలో అమీర్ పేట్, సికింద్రబాద్, బేగంపేట సహా మొత్తం 27 స్టేషన్లు ఉన్నాయి. ఇక గ్రీన్ లేన్ మార్గం జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వరకు ఉంది. ఇది 11 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇందులో 9 స్టేషన్లు ఉన్నాయి. ఇక మూడో లేన్ బ్లూ ఇది నాగోల్ నుంచి రాయదుర్గం వరకు 38 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇందులో 23 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. మూడు మార్గాల్లో కలిపి మొత్తం 57 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ మెట్రో సేవలను మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

టాపిక్

తదుపరి వ్యాసం