తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Metro Charges : మెట్రో ఛార్జీలపై ఏదైనా చెప్పాలా? అయితే చెప్పేయండి

Hyderabad Metro Charges : మెట్రో ఛార్జీలపై ఏదైనా చెప్పాలా? అయితే చెప్పేయండి

HT Telugu Desk HT Telugu

30 October 2022, 22:49 IST

google News
    • Hyderabad Metro Rail Charges : హైదరాబాద్ మెట్రో ఛార్జీలపై ఏదైనా చెప్పాలనుకునేవారికి ఓ అవకాశం. నవంబర్ 11లోపు ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా సూచనలు పంపాలి.
హైదరాబాద్ మెట్రో రికార్డు
హైదరాబాద్ మెట్రో రికార్డు (HT)

హైదరాబాద్ మెట్రో రికార్డు

హైదరాబాద్ మెట్రో రైలు(Hyderabad Metro Rail) ఛార్జీల సవరణను సిఫార్సు చేయడం కోసం ఛార్జీల నిర్ణయ కమిటీ (FCC) ఏర్పాటు చేశారు. అయితే ప్రయాణికులు మెట్రో ఛార్జీల సవరణపై సలహాలు, సూచనలు చేయోచ్చు. ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా నవంబర్ 11 లేదా అంతకు ముందు సూచనలను పంపవచ్చు.

పలు ప్రాంతాలకు ఛార్జీల సవరణ కోసం ప్రయాణికుల(Passengers) నుంచి సలహాలను ఆహ్వానించారు. సర్వీస్ ఫేర్ ఫిక్సేషన్ కమిటీ రవాణా సేవల ఛార్జీల సవరణ కోసం సూచనలను ఆహ్వానించింది. 57 స్టేషన్లు, మూడు జంక్షన్‌లతో ఒక స్టేషన్ నుండి మరొక స్టేషన్‌కు అతి తక్కువ టికెట్ ధర రూ.10, అత్యధిక ధర రూ.60గా ఉంది.

ప్రయాణికులు తమ సూచనలను ఇమెయిల్ ద్వారా ffchmrl@gmail.comకు పంపవచ్చు. నవంబర్ 11న లేదా అంతకంటే ముందు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ చైర్మన్‌కి పోస్ట్‌లో పంపవచ్చు. పోస్ట్ ద్వారా చైర్మన్, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ, మెట్రో రైల్ భవన్, బేగంపేట, సికింద్రాబాద్-500003, తెలంగాణకు పంపాలి. పోస్ట్ నవంబర్ 11 లోపు చేరుకోవాలి.

అధిక డిమాండ్ కారణంగా హైదరాబాద్ మెట్రో రైల్ ఇటీవల సమయాన్ని పొడిగించింది. ఉదయం 6 గంటలకు మెట్రో రైలు ప్రారంభమవుతోంది. రాత్రి 11 గంటల వరకు ఉంది. అంతకుముందు రాత్రి 10.15 గంటల వరకే టర్మినల్‌ సేషన్ల నుంచి చివరి మెట్రో(Metro) నడిచేది. అక్టోబర్ 10 నుంచి ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు రాత్రి సమయాల్లో మెట్రో టైమింగ్స్ మారాయి. చివరి మెట్రో రైలు(Metro Rail) రాత్రి 11 గంటలకు బయల్దేరుతుంది. ఉదయం 6 గంటల నుంచి మెట్రో సేవలు షురూ అవుతాయి.

కొవిడ్ 19(Covid 19) తర్వాత.. ఉద్యోగులను కార్యాలయాలకు తిరిగి రావాలని కోరినప్పటి నుంచి మెట్రో సేవలు గణనీయంగా వినియోగించుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఇది రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలనే డిమాండ్‌కు దారితీసిందని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైల్ క్రమంగా పుంజుకుంటోందన్నారు. గత కొన్ని నెలల్లో హెచ్‌ఎంఆర్‌ఎల్‌లో రోజూ 3 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఉదయం, సాయంత్రం కార్యాలయ వేళల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.

ప్రయాణికులు.. కొవిడ్-19కి ముందు స్థాయికి చేరుకోవడంతో, రద్దీ పెరిగింది. ప్రయాణికులు మరిన్ని కోచ్‌లను జోడించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు(Hyderabad Metro Rail)కు కనీసం రద్దీ సమయాల్లో కోచ్‌లను జోడించాల్సిన సమయం ఆసన్నమైందని ఓ మెట్రో ప్రయాణికుడు అన్నారు.

తదుపరి వ్యాసం