తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Elections : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముస్లిం లీగ్ మద్దతు, రాహుల్ గాంధీకి లేఖ

TS Elections : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముస్లిం లీగ్ మద్దతు, రాహుల్ గాంధీకి లేఖ

HT Telugu Desk HT Telugu

06 November 2023, 15:45 IST

google News
    • TS Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు తెలిపింది. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది.
కాంగ్రెస్ కు ముస్లిం లీగ్ మద్దతు
కాంగ్రెస్ కు ముస్లిం లీగ్ మద్దతు

కాంగ్రెస్ కు ముస్లిం లీగ్ మద్దతు

TS Elections : తెలంగాణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలకుండా జాగ్రత్త పడుతుంది. అందుకోసం పలు పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళుతుంది. సీపీఐతో కాంగ్రెస్ పొత్తు ఖరారు కాగా ఈరోజు అధికారికంగా దానిపై ప్రకటన రానుంది. మరోవైపు ప్రొఫెసర్ కోదండరాం, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రొఫెసర్ కోదండరాం, షర్మిల ఇద్దరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని, కేసీఆర్ ను ఎలాగైనా గద్దె దించాలనే తాము కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతునట్లు వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీకి ముస్లిం లీగ్ మద్దతు

ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి మరో పార్టీ మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) పార్టీ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు తమ పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ,కేరళా ఎమ్మెల్యే పీకే కున్హాలకుట్టి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు లేఖ రాశారు. తెలంగాణలో తమకు బలమైన పునాదులు ఉన్నాయని పీకే కున్హాలకుట్టి పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రచారంలో ముస్లిం లీగ్ నేతలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు కలిసి పనిచేస్తామని పీకే కున్హాలకుట్టి అన్నారు. తెలంగాణలో ఇండియన్ ముస్లిం లీగ్ నేతలు, పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొని కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తారని ఆయన పేర్కొన్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

తదుపరి వ్యాసం