తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Durgamma Nimajjanam : హైదరాబాద్ లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం, ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Durgamma Nimajjanam : హైదరాబాద్ లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం, ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

HT Telugu Desk HT Telugu

23 October 2023, 16:07 IST

google News
    • Durgamma Nimajjanam : హైదరాబాద్ లో ఇవాళ్టి నుంచి ఈ నెల 26 వరకు ట్యాంక్ బండ్ లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలు జరుగనున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్ పరిసరాల్లో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
దుర్గామాత విగ్రహాల నిమజ్జనం
దుర్గామాత విగ్రహాల నిమజ్జనం

దుర్గామాత విగ్రహాల నిమజ్జనం

Durgamma Nimajjanam : హైదరాబాద్ లో నేటి( సోమవారం) నుంచి ఈనెల 26 వరకు దుర్గామాత విగ్రహాల నిమజ్జనాల కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని హుస్సేన్ సాగర్ పరిసరాల్లో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, గార్డెన్ పాయింట్, బేబీ పాండ్స్, సంజీవయ్య పార్క్ వద్ద నిమజ్జనాలు జరుగనున్నట్లు సుధీర్ బాబు ప్రకటించారు. ఈ మేరకు వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రాంతాల్లో ప్రయాణించాలని, మళ్లింపు పాయింట్లను గమనించుకోవాలని కోరారు.

ట్రాఫిక్ ఆంక్షలు

ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

  • పంజాగుట్ట ,రాజ్ భవన్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైకి వచ్చే వాహనాలు వీవీ విగ్రహం వద్ద సదన్ కాలేజీ, నిరంకరి వైపు మళ్లించారు.
  • కంట్రోల్ రూం, సైఫాబాద్ నుంచి ఇక్బర్ మినార్ వైపు వెళ్లే వాహనాలను రవీంద్ర భారతి వద్ద లక్డీకాపుల్ వైపు మళ్లించారు.
  • నిరాంకరి జంక్షన్ నుంచి ఇక్బార్ మినార్ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద రవీంద్ర భారతి వైపు మళ్లించారు.
  • ఇక్బార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ పైకి తెలుగు తల్లి జంక్షన్ మీదుగా వెళ్లే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైకి మళ్లించారు.
  • అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఇక్బార్ మినార్ వైపు మళ్లించారు.
  • రాణిగుంజ్, మినిస్టర్ రోడ్ నుంచి పీవీ మార్గ్, నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలు నల్లకుంట బ్రిడ్జి వద్ద మళ్లించారు.
  • నాంపల్లి, కంట్రోల్ రూం వైపు నుంచి బీజేఆర్ సర్కిల్ వైపు వెళ్లే వాహనాలకు అనుమతి ఉండదు.
  • బుద్ధభవన్ నుంచి నల్లకుంట వైపు వెళ్లే వాహనాలకు అనుమతి ఉండదు. బదులుగా ఆ వాహనాలను మస్జిద్ సొనబి అబ్దుల్లా వద్ద మినిస్టర్ రోడ్డు , రాణిగంజ్, వైపు మళ్లిస్తారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

తదుపరి వ్యాసం