తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : ముఖానికి చున్నీ కట్టుకుని నటిస్తే పది లక్షలు ఇస్తానని, నగ్న వీడియోలతో యువతికి వేధింపులు

Hyderabad Crime : ముఖానికి చున్నీ కట్టుకుని నటిస్తే పది లక్షలు ఇస్తానని, నగ్న వీడియోలతో యువతికి వేధింపులు

05 August 2023, 14:26 IST

google News
    • Hyderabad Crime : ఆర్థిక కష్టాల్లో ఉన్న యువతిని సాయం చేస్తానని నమ్మించి.. నగ్న వీడియోతీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడో వ్యక్తి. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
నగ్న వీడియోలు తీసి వేధింపులు
నగ్న వీడియోలు తీసి వేధింపులు

నగ్న వీడియోలు తీసి వేధింపులు

Hyderabad Crime : ఆర్థిక కష్టాల్లో ఉన్న యువతికి ఆసరా ఉంటానని నమ్మించాడో వ్యక్తి. ఓ వెబ్ సిరీస్ లో నటిస్తే లక్షల్లో డబ్బు ఇస్తానని నమ్మించాడు. ఆర్థిక సమస్యలు గట్టెక్కుతాయని ఆ మాయగాడి మాటలు నమ్మిన యువతి మరిన్ని సమస్యల్లో చిక్కుకుంది. వెబ్ సిరీస్ అవకాశం ఇప్పిస్తామని ఓ హోటల్ కు యువతిని పిలిచి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపాడు. అనంతరం యువతి నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ మొదలుపెట్టాడు. చివరకు మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది.

నగ్న వీడియోలు తీసి బెదిరింపులు

ఏపీలోని విశాఖకు చెందిన యువతి హైదరాబాద్ లో ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు చెన్నకేశవ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆర్థిక కష్టాల్లో యువతి... చెన్న కేశవను సాయం కోరింది. దీనికి అతడు ఓ సలహా ఇచ్చాడు. ఓ వెబ్ సిరీస్ లో ముఖానికి చున్నీ కట్టుకుని నటిస్తే పది లక్షల రూపాయలు ఇస్తారని యువతిని నమ్మించాడు. డబ్బు అత్యవసరం కావడంతో ఆ యువతి చెన్నకేశవ చెప్పినట్లు చేసేందుకు ఒప్పుకుంది. దీంతో ఆ యువతిని హైదరాబాద్ పంజాగుట్టలోని ఒక హోటల్ కు రమ్మన్నాడు. హోటలకు వచ్చిన యువతికి కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అది తాగిన యువతి మత్తులోకి జారుకున్నాక చెన్నకేశవ ఆమె నగ్న వీడియోలు తీశాడు. మత్తు నుంచి బయటకు వచ్చాక ఆ వీడియోలు చూపించి యువతిని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ

భర్తతో ఉన్న విభేదాల నేపథ్యంలో ప్రియుడు, అతని స్నేహితుడు సహయంతో భర్తను అంతం చేసిన భార్య వ్యవహారం విశాఖపట్నంలో సంచలనం సృష్టించింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేష్‌ను పక్కా ప్రణాళికతో హతమార్చిన వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. నిద్రిస్తున్న భర్తను ఇంట్లోనే పథకం ప్రకారం దిండుతో ఊపిరి ఆడకుండా చేసి గుండెనొప్పిగా చిత్రీకరించారు. అంత్యక్రియల సమయంలో స్థానికుల అనుమానం వ్యక్తం చేయడంతో భార్య శివ జ్యోతి అలియాస్ శివానిని పోలీసులు విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

ట్యాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం నేపథ్యంలో కానిస్టేబుల్ రమేష్ దంపతుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రమేష్ హత్య చేసేందుకు పక్కాగా ప్లాన్ చేసింది భార్య. భర్తను చంపేసి గుట్టుచప్పుడు కాకుండా అంతక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఆరోగ్యంగా ఉన్న కానిస్టేబుల్ చనిపోవడంతో అనుమానించిన విశాఖ ఎంవీపీ పోలీసులు విచారణ జరిపారు. విచారణలో అక్రమ సంబంధం వ్యవహారం వెలుగు చూడటంతో భార్యను తమదైన శైలిలో విచారించగా హత్యకు పాల్పడినట్టు ఒప్పుకుంది. విశాఖలో బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విశాఖ వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ కేసును పోలీసులు చివరకు హత్యగా నిర్ధారించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. మరో వ్యక్తి సాయంతో భర్తను ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.

తదుపరి వ్యాసం