తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రాజేంద్ర నగర్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

రాజేంద్ర నగర్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

HT Telugu Desk HT Telugu

26 March 2024, 16:23 IST

    • గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. దాదాపు రూ. 11 లక్షలు విలువ చేసే 30 కేజీల గంజాయిని బ్రౌన్ కలర్ పాకెట్స్ లో ప్యాకింగ్ చేసి ఆటోలో దాచినట్టు పోలీసులు గుర్తించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.
హైదరాబాద్ నగరంలో గంజాయి, మాదక ద్రవ్యాల పట్టివేత
హైదరాబాద్ నగరంలో గంజాయి, మాదక ద్రవ్యాల పట్టివేత

హైదరాబాద్ నగరంలో గంజాయి, మాదక ద్రవ్యాల పట్టివేత

హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అయాన్, మొహమ్మద్ మొయినుద్దీన్ తో పాటు దీపక్ పాటిల్‌పై పోలీసులు ఎండీపీఎస్ యాక్ట్ నమోదు చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన దీపక్ పాటిల్ కు మొహమ్మద్ అయాన్ మరియు మొహమ్మద్ మొయినుద్దీన్ స్నేహితులు. దీపక్ పాటిల్ భద్రాచలం‌లో 30 కేజీల గంజాయి కొనుగోలు చేసి దాన్ని ఆటో ట్రాలీ లో హైదరాబాద్ కు స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు

Pet Dog Attacked Infant : పెంపుడు కుక్క దాడిలో 5 నెలల పసికందు మృతి, రష్మి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!

Medak Crime : భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం- పిల్లలు గుర్తొచ్చి మహిళ ఆత్మహత్య

Mahabubabad Crime : మంత్రాల నెపంతో దంపతులపై దాడి, మహబూబాబాద్ జిల్లాలో తరచూ దారుణాలు!

Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, మే 20 వరకు రిమాండ్ పొడిగింపు

దీపక్ పాటిల్ మరియు మొహమ్మద్ మొయినుద్దీన్ బైక్ పై హైదరాబాద్ కు వస్తూ రోడ్లపై పోలీసుల తనిఖీలు గురించి ఎప్పటికప్పుడు ఆటో‌లో వస్తున్న అయాన్ కు సమాచారం అందించారు. ఈనేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్ర నగర్ SOT బృందం మాటు వేసి ఆటో‌ను పట్టుకున్నారు.

గంజాయిని ఇంజనీరింగ్ విద్యార్థులకు విక్రయించేందుకు చిన్న చిన్న పాకెట్స్ లో ప్యాకింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారి నుంచి రెండు సెల్ ఫోన్లు, ఒక ఆటో, బైక్, రూ. 11 లక్షల విలువైన 30 కేజీల గంజాయి మరియు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి కేసులో ఇరికిద్దామనుకొని

మరోవైపు వికారాబాద్ జిల్లా పరిగిలో గంజాయి కేసులో నలుగురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సయ్యద్ అనే వ్యక్తి తన శత్రువైన ముషారఫ్‌ను జైలుకు పంపాలనే ఉద్దేశంతో ముషారఫ్ కారులో 207 గ్రాముల గంజాయిని పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు కారు ఓనర్ ముషారఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.

తనకు గంజాయితో ఎలాంటి సంబంధం లేదని కావాలనే సయ్యద్ తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. దీంతో పోలీసులు కారు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా… అక్కడ సయ్యద్ అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించి తమదైన స్టైల్లో విచరించడంతో తానే ముషారఫ్‌ను ఇరికించాలని కారులో 207 గ్రాముల గంజాయి పెట్టినట్లు అంగీకరించాడు.

గంజాయి ఎక్కడిదని పోలీసులు ప్రశ్నించగా మరో ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్పడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

పంజాగుట్ట లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరబాద్ లోని పంజాగుట్ట లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పాలస్తీనాకు చెందిన సయ్యద్ అలీ, అలాగే ముంబయికి చెందిన రోమి డ్రగ్స్ తరలిస్తున్నారని విశ్వశనీయ సమాచారం అందుకున్న పోలీసులు వారిని పంజాగుట్ట వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 4.75 గ్రాముల ఎక్స్‌టసీ పిల్స్, 5.18 గ్రాముల ఎండీఎంఏ, 109 గ్రాముల గంజాయి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా వీరికి పలువురు అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ల‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని రిమాండ్ కు తరలించారు.

- రిపోర్టింగ్: కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

తదుపరి వ్యాసం