తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Suicide: పనిచేసే ఫ్యాక్టరీలో దొంగతనం చేస్తూ పట్టుబడి.. అవమానంతో ప్రాణాలు తీసుకున్నాడు

Sangareddy Suicide: పనిచేసే ఫ్యాక్టరీలో దొంగతనం చేస్తూ పట్టుబడి.. అవమానంతో ప్రాణాలు తీసుకున్నాడు

HT Telugu Desk HT Telugu

20 September 2024, 9:48 IST

google News
    • Sangareddy  Suicide: నిచేస్తున్న కంపెనీలో ఉన్న చిన్న వస్తువు పై ఆశపడి, వాటిని దొంగతనంగా తీసుకెళ్తూ పట్టుబడ్డాడో ఆ ప్రైవేట్ ఉద్యోగి. తాను చేసిన తప్పుపని అందరికి తెలిసిందని అవమానంతో ప్రాణాలు తీసుకొని తన భార్య ఇద్దరు పిల్లల బతుకును రోడ్డున న పడేశాడు.
క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న జనార్థనరావు
క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న జనార్థనరావు

క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న జనార్థనరావు

Sangareddy Suicide: పద్నాలుగేళ్లుగా పనిచేస్తున్న కంపెనీలో చోరీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డిలో జరిగింది. ఫ్యాక్టరీలో వస్తువులను బయటకు తీసుకెళుతున్నాడనే అభియోగాలతో సెక్యూరిటీ అడ్డుకోవడంతో పరువు పోతుందని, అవమానంతో ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యతో భార్య ఇద్దరు పిల్లల బతుకును రోడ్డున పడేశాడు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లాలోచోటుచేసుకుంది.

ఆంద్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన లుకలాపు జనార్దన్ రావు (45) పటాన్‌ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతడు గత 14 సంవత్సరాలుగా పాశమైలారంలోని synthokem labs లో ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

రోజు మాదిరిగానే డ్యూటీ కి వెళ్లి.…

ఈ క్రమంలో జనార్ధన్ రావు రోజు మాదిరిగానే బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు డ్యూటీకి వెళ్ళాడు. అనంతరం రాత్రి పది గంటలకు డ్యూటీ ముగించుకొని ఇంటికి రావాలి. అదనపు ఆదాయం కోసం తాను కంపెనీలో అప్పుడప్పుడు ఓవర్ టైం పని చేస్తాడు. కావున రాత్రి రాకపోయేసరికి ఓటీ చేస్తున్నాడేమో అందుకే ఇంటికి తిరిగి రాలేదని భార్య అనుకుంది.

గురువారం ఉదయం ఆరున్నర గంటలకు కంపెనీ సెక్యూరిటీ నుండి ఫోన్ చేసి తన భార్య విజయకు అసలు విషయం తెలపటంతో వారు హతాశులయ్యారు కుటుంబసభ్యులు. దీంతో ఆమె కుటుంబసభ్యులను, బంధువులను తీసుకొని అక్కడికి వెళ్ళి చూసేసరికి జనార్దన్ మృతి చెంది ఉన్నాడు. భర్త శవాన్ని చూసిన భార్య శోకసంద్రంలో మునిగిపోయింది.

అసలు ఏం జరిగిందంటే .…

బుధవారం రాత్రి డ్యూటీ ముగించుకొని స్కూటీపై జనార్దన్ ఇంటికి బయల్దేరారు. గేటు దగ్గరకు రాగానే యధావిధిగా సెక్యూరిటీ గార్డ్ అతని వాహనాన్ని చెక్ చేసినట్టు చెబుతున్నారు. జనార్దన్ స్కూటీలో డిక్కీలో కంపెనీకి సంబంధించిన వస్తువులు దొరికాయంటూ గార్డ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అతడిని అక్కడే ఉంచారు.

కంపెనీలో రోజు పని చేసే అందరి ముందు దొంగతనం ముద్ర వేయించుకోవాల్సి రావడం, ఉద్యోగం పోతుందనే భయంతో, క్షణికావేశంలో జనార్దన్ తన ప్రాణాలు తీసుకున్నాడు.

పనిచేస్తున్న కంపెనీ లోనే ఆత్మహత్య....

ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 4: 30 ని,లకు సెక్యూరిటీ రూమ్ లో నుండి బయటకు వచ్చాడు. అదే పరిశ్రమ క్యాంటిన్ బిల్డింగ్ పైకి వెళ్లి తాడును పిల్లర్ దిమ్మకు కట్టి, మరోవైపు తనకు తానుగా మెడకు కట్టుకొని బిల్డింగ్ పై నుండి దూకాడు. దీంతో మెడకు తాడు ఉరి పడడంతో మృతి చెందాడు.

జనార్థన్‌ కుటుంబములో జనార్దన్ ఒక్కడే సంపాదిస్తాడని, తాను చనిపోవటం తో తాను తన బిడ్డలు దిక్కులేనివారయ్యారని, జనార్దన్ భార్య విజయ కన్నీరు మున్నీరయ్యారు. విషయం వెలుగు చూడటంతో మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.

కంపెనీ యాజమాన్యం జనార్దన్ కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకుంటామని హామీ ఇవ్వటంతో వివాదం సద్దుమణిగింది. BDL భానూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని, శవాన్ని పోస్టుమార్టం కోసం పఠాన్ చెరువు ఆసుపత్రికి తరలించారు. అనంతరం, అంతక్రియల కోసం శ్రీకాకుళం జిల్లాలోని స్వంత గ్రామానికి మృతదేహాన్ని తరలించారు.

తదుపరి వ్యాసం