Hyd Boy Killed in US: ప్రాణం తీసిన తుపాకీ మోజు,యూఎస్‌లో గన్ మిస్‌ఫైర్.. హైదరాబాద్ యువకుడి మృతి
22 November 2024, 12:20 IST
- Hyd Boy Killed in US: తుపాకీ మోజు అమెరికాలో ఓ హైదరాబాద్ యువకుడి ప్రాణం తీసింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన హైదరాబాద్‌కు చెందిన యువకుడు లైసెన్స్ తుపాకీని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలడంతో ప్రాణాలు కోల్పోయాడు.
గన్ మిస్‌ఫైర్ కావడంతో హైదరాబాద్ యువకుడి దుర్మరణం
Hyd Boy Killed in US: తుపాకీ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలడంతో అమెరికాలో ఉప్పల్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన చెందిన 23 ఏళ్ల విద్యార్థి అమెరికాలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా ప్రమాదవశాత్తూ తుపాకీ నుంచి మిస్ ఫైర్ కావడంతో మృతి చెందాడు.
ఆర్యన్‌రెడ్డి అనే విద్యార్థి జార్జియాలోని అట్లాంటాలోని తన ఇంట్లో స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్న సమయంలో గత వారం నవంబర్ 13న ఈ ఘటన జరిగింది. పుట్టిన రోజు వేడుకలో ఆర్యన్ రెడ్డి తుపాకీని శుభ్రం చేయడానికి కొత్తగా కొనుగోలు చేసిన వేట తుపాకీని బయటకు తీశాడు.ఆ సమయంలో ట్రిగ్గర్ నొక్కుకోవడంతో అతని ఛాతీ లోకి బుల్లెట్ దూసుకెళ్లి ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు.
తుపాకీ కాల్పుల శబ్దం వినగానే ఆర్యన్ రెడ్డి స్నేహితులు వెళ్ళి చూసేసరికి రక్తపు మడుగులో ఉన్న స్నేహితుడిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించిన అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
ఆర్యన్ రెడ్డి అట్లాంటాలోని కాన్సాస్ స్టేట్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతూ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. తెలంగాణలోని భువనగిరి జిల్లాలోని పెద్దరావు పల్లి గ్రామానికి చెందిన ఆర్యన్ కుటుంబం ప్రస్తుతం ఉప్పల్ జిల్లాలో నివసిస్తోంది. ఉప్పల్ బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. విద్యార్ధి పుట్టిన రోజే ఈ విషాద ఘటన చోటు చేసు కోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఒక్కగానొక్క కుమారుడు ఇక తిరిగిరాడనే విషయాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. బీబీనగర్ పోచంపల్లి మండలం పెద్దరావుల పల్లి గ్రామానికి చెందిన పాల్వాయి సుదర్శన్ రెడ్డి, దీప దంపతులు ఉప్పల్ బ్యాంక్ కాలనీలో నివాసముంటున్నారు. వీరి కుమా రుడు పాల్వాయి అరుణ్ రెడ్డి గత ఏడాది డిసెంబర్లో అమెరికాలోని జార్జియా స్టేట్ అట్లాంటా పట్టణంలోని కెనిస్వా యూనివర్సిటీలో ఉన్నత విద్య కోసం వెళ్లాడు.
ఈ నెల 13న తన గదిలోనే స్నేహితుల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అరుణ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అదే రోజు ఉదయం 10 గంటల సమయంలో తన హంటింగ్ లైసెన్స్ డ్ గన్ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ కావడంతో తూటా అరుణ్ ఛాతీలోకి దూసుకెళ్లి అక్కడికక్కడే మృతి చెందినట్లు తండ్రి సుదర్శన్ రెడ్డి తెలిపారు.
ఆర్మీలో చేరాలనే కోరికతో తుపాకీ పేల్చడంలో శిక్షణ కూడా పొందుతున్నాడని ఆర్యన్ తండ్రి వివరించారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తర్వాత గన్ కొను గోలు చేసిన విషయం తనకు తెలియదన్నారు. శిక్షణ పొందిన తర్వాత హంటింగ్ గన్ లైసెన్స్ ఇస్తారని తెలిపారు. గురువారం రాత్రి ఆర్యన్ మృతదేహం స్వస్థలానికి చేరుకుంది.