Vemulawada Temple: వేములవాడలో ఘనంగా మహా లింగార్చన
12 September 2023, 9:29 IST
- Vemulawada Temple: శ్రావణమాసంలోని చివరి సోమవారం పురస్కరించుకుని దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో మహాలింగార్ఛన కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. తెల్లవారు జామున రాజరాజేశ్వర స్వామి వారికి ఆలయ పండితుల ఆధ్వర్యంలో ఘనంగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు.
వేముల వాడలో మహాలింగార్చన
Vemulawada Temple: శ్రావణమాసంలోని చివరి సోమవారాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాలింగార్ఛన కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. తెల్లవారు జామున రాజరాజేశ్వర స్వామి వారికి ఆలయ పండితుల ఆధ్వర్యంలో ఘనంగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకం గావించారు.
తెల్లవారు జాము నాలుగు గంటలనుండి భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అతిశీఘ్ర దర్శనం ఏర్పాటు చేసారు. అనంతరం ప్రదోషకాలంలో గోపన్నగారి శివశర్మ గారితో పాటు పలువురు వేదపండితుల నిర్వహాణలో మహాలింగార్చన నిర్వహించారు.
శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో మహాలింగార్చన నిర్వహించామని ఆలయపండితులు తెలిపారు. 365 మృత్తికా లింగాలను ఒకే మండపంలో ఉంచి లింగార్చన చేసారు. శివలింగా కారంలో జ్యోతులను ఏర్పాటు చేసి దీపారాధన చేసారు. శ్రావణ శోభతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం నెలకుంది.శ్రావణ సోమవారం సుమారు యాభైవేలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. ht
(గోపీ కృష్ణ, కరీంనగర్)