తెలుగు న్యూస్  /  Telangana  /  Girl-died-in-farm House In Sangareddy District Over Air Gun Misfire

సంగారెడ్డిలో విషాదం.. ఎయిర్​ గన్ పేలి నాలుగేళ్ల చిన్నారి మృతి

HT Telugu Desk HT Telugu

16 March 2022, 13:51 IST

    • ఫామ్‌హౌస్‌లో ఎయిర్‌గన్‌ పేలి నాలుగేళ్ల బాలిక మృతిచెందింది. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి
ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి (unsplash)

ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి

సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం వావిలా శివారులో విషాదం నెలకొంది. ఓ ఫామ్‌హౌస్‌లో ఎయిర్‌గన్‌ పేలి నాలుగేళ్ల బాలిక మృతిచెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో మంగళవారం ఉదయం పది గంటల సమయంలో ఎయిర్‌గన్‌ పేలింది. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న ఓ వ్యక్తి కుమార్తె అయినా శాన్వి(4) గాయాలపాలైంది. తీవ్రంగా గాయపడిన శాన్విని స్థానికంగా ఉన్న ఆర్​ఎంపీ దగ్గరకి తీసుకెళ్లగా చికిత్స అందించలేకపోయాడు. పరిస్థితి విషమించటంతో వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు విడిచింది.

ట్రెండింగ్ వార్తలు

Sangareddy Crime : సంగారెడ్డిలో దారుణం, ఓ వ్యక్తిని హత్య చేసి పొలంలో పడేసిన దుండగులు

TS SSC Supplementary Exams: రీ కౌంటింగ్ ఫలితాల కోసం ఆగొద్దు.. సప్లిమెంటరీకి అప్లై చేయాలని బోర్డు సూచన…

TS SSC Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల.. 91శాతం ఉత్తీర్ణత, గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు

TS 10th Results 2024: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే

ఎయిర్​ గన్​తో ఎవరైనా కాల్చారా? ప్రమాదవశాత్తుగా ఏమైనా జరిగిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. ఒక్కసారిగా ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.