తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ganesh Chaturthi : వాడవాడలా గణనాథుల సందడి, తొలిపూజ అందుకున్న ఖైరతాబాద్ గణేశుడు

Ganesh Chaturthi : వాడవాడలా గణనాథుల సందడి, తొలిపూజ అందుకున్న ఖైరతాబాద్ గణేశుడు

18 September 2023, 15:01 IST

Ganesh Chaturthi : తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథులు సందడి చేస్తున్నారు. కాలనీల్లో మండపాలు వెలిశాయి. బొజ్జ గణపయ్య భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఈ ఏడాది ఖైరతాబాద్ లో 63 అడుగుల మహా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

  • Ganesh Chaturthi : తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథులు సందడి చేస్తున్నారు. కాలనీల్లో మండపాలు వెలిశాయి. బొజ్జ గణపయ్య భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఈ ఏడాది ఖైరతాబాద్ లో 63 అడుగుల మహా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఖైరతాబాద్‌లోని 63 అడుగుల మహా గణపతికి తొలిపూజ జరిగింది. ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యా గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామి వారి కుడివైపున లక్ష్మీనరసింహస్వామి, ఎడమ వైపు వీరభద్రస్వామి విగ్రహాలను ఏర్పాటుచేశారు. 
(1 / 8)

ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహా గణపతికి సోమవారం ఉదయం 11 గంటలకు తొలిపూజ జరిగింది. ఈ పూజలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొన్నారు. 
(2 / 8)

ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.  
(3 / 8)

ముంబయిలోని జీఎస్బీ సేవా మండల్‌లో 'గణేష్ చతుర్థి' పండుగ సందర్భంగా బంగారు, వెండి, వజ్రాభరణాలతో అలంకరించబడిన గణేశ్ విగ్రహం
(4 / 8)

ముంబయిచా రాజా పండల్‌పై గణనాథుడి విగ్రహం 
(5 / 8)
ముంబయిచా రాజా పండల్‌పై గణనాథుడి విగ్రహం 
ముంబయిలో 'గణేష్ చతుర్థి' పండుగకు సందర్భంగా భక్తులు తీసుకెళ్తున్న వినాయకుని విగ్రహం  
(6 / 8)

భోపాల్‌లో గణేష్ చతుర్థి పండుగకు ఒక కళాకారుడు గణేశ్ విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. 
(7 / 8)

దేశవ్యాప్తంగా పూజలందుకుంటున్న గణపయ్య 
(8 / 8)
దేశవ్యాప్తంగా పూజలందుకుంటున్న గణపయ్య 

    ఆర్టికల్ షేర్ చేయండి