తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karim Nagar Arrests: ఫంక్షన్ హాల్స్‌ టార్గెట్.. మైనర్ బాలుడితో కలిసి చోరీలు చేస్తున్న ఘరానా దొంగల అరెస్ట్

Karim Nagar Arrests: ఫంక్షన్ హాల్స్‌ టార్గెట్.. మైనర్ బాలుడితో కలిసి చోరీలు చేస్తున్న ఘరానా దొంగల అరెస్ట్

HT Telugu Desk HT Telugu

25 March 2024, 5:37 IST

google News
    • Karim Nagar Arrests: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన ముగ్గురిని ఎల్ఎండీ కాలనీ పోలీసులు అరెస్టు చేశారు.
ఫంక్షన్‌ హాల్స్‌లో చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్
ఫంక్షన్‌ హాల్స్‌లో చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్

ఫంక్షన్‌ హాల్స్‌లో చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్

Karim Nagar Arrests: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన ముగ్గురిని ఎల్ఎండీ కాలనీ LMD Colony పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 150 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు సెల్ ఫోన్ లు స్వాధీన చేసుకున్నారు.

ఫంక్షన్‌ హాల్స్‌ లక్ష్యంగా చోరీలు…

కరీంనగర్ Karim Nagar ఖాన్ పురాకు చెందిన మహమ్మద్ రహీం బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గరలోని అమ్మనిష్ సెంటర్ నందు జిమ్ ట్రైనర్‌గా Gym trainer పని చేసేవారు. ఆ సెంటర్ కు ఈత నేర్చుకోవడానికి వచ్చే 12 ఏళ్ళ బాలుడితో పరిచయం పెంచుకుని ఇద్దరు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సులువుగా సంపాదించాలని పథకం పన్నారు.

ఫంక్షన్ హాల్స్ Function Halls లక్ష్యంగా చోరీలు Robbery చేయడం ప్రారంభించారు. ఫంక్షన్స్ జరిగే సమాచారాన్ని రహీం తన స్నేహితుడైన ఆటో డ్రైవర్ మైసన్ బిన్ హది తో తెలుసుకొనేవాడు. ఫంక్షన్ హాల్స్ కు రహీం, చిన్న బాలుడితో బైక్ పై వెళ్ళి చోరీలకు పాల్పడ్డారు.

ఫంక్షన్‌ హాల్స్ ముందు రహీం బైక్ పై బయటే ఉంటే, చిన్న బాలుడు ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్ళి ఆజాగ్రత్తగా పెట్టిన హ్యాండ్ బ్యాగ్స్ నుండి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని బయటకు వచ్చి రహీంతో కలిసి బైక్ పై పారిపోయేవారు. అలా కరీంనగర్, బొమ్మకల్ , అలుగునూర్, హుజురాబాద్ లలోని పలు ఫంక్షన్స్ హాల్స్ నందు బంగారు ఆభరణాలు, లాప్ టాప్ లు, డబ్బులు చోరీ చేశారు.

చోరీ చేసిన బంగారు అభరణాలలో కొన్నిటిని అమ్మడానికి వరంగల్ కు చిన్న బాలుడు, మైసన్ బిన్ హాది లు బైక్ పై వెళ్తుండగా అల్గునూరు వద్ద ఎల్ఎండీ ఎస్ చేరాలు వాహనాల తనిఖీ చేపట్టగా పట్టుబడ్డారు. వారి నుంచి నాలుగు గ్రాముల బంగారు ఉంగరాలు, రెండు సెల్ ఫోన్లు , ఒక లాప్ టాప్, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాన నిందితుడు కోసం నాలుగు బృందాలు

మైనర్ తో పంక్షన్ హాల్స్ లో చోరీలకు పాల్పడే ప్రధాన నిందితుడు మహమ్మద్ రహీమ్ ను పోలీసులు పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

మైనర్ తో పాటు ఆటో డ్రైవర్ పోలీసులకు చిక్కడంతో మహమ్మద్ రహీం దొంగిలించిన బంగారు సొత్తుతో పారిపోయేందుకు కరీంనగర్ బస్టాండ్ కు చేరుకోగా పోలీసులు పట్టుకున్నారు‌.

అతడి నుంచి 150 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు సెల్ ఫోన్ లు స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించారు. ముగ్గురు దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను కరీంనగర్ సిపి అభిషేక్ మోహంతి అభినందించారు.

ఊపిరి పీల్చుకున్న స్థానికులు

ఫంక్షన్ హాల్స్ లక్ష్యంగా చోరీలకు పాల్పడిన ముగ్గురు ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో అటు స్థానికులు ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ తో పాటు ఇతర పట్టణాల్లో ఫంక్షన్ హాల్ వద్ద ఇటీవల చోరీలు జరగడంతో ప్రతి ఒక్కరికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ప్రస్తుతం ముగ్గురు పట్టుపడడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

(రిపోర్టింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి)

తదుపరి వ్యాసం