తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  𝗙𝗿𝗲𝗲 𝗘𝗻𝘁𝗿𝘆: ప్రజలకు గుడ్ న్యూస్… ఈ టూరిజం ప్రాంతాలను ఫ్రీగా చూడొచ్చు

𝗙𝗿𝗲𝗲 𝗘𝗻𝘁𝗿𝘆: ప్రజలకు గుడ్ న్యూస్… ఈ టూరిజం ప్రాంతాలను ఫ్రీగా చూడొచ్చు

HT Telugu Desk HT Telugu

04 August 2022, 18:49 IST

google News
    • azad ka amrit mahotsav: ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర పురావస్తు శాఖ. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పురావస్తు కేంద్రాలు, చారిత్రక ప్రదేశాలు, పురాతన కట్టడాలను ఉచితంగా చూసే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
చార్మినార్, గోల్కొండ ఇకపై ఫ్రీగా చూడొచ్చు
చార్మినార్, గోల్కొండ ఇకపై ఫ్రీగా చూడొచ్చు (twitter)

చార్మినార్, గోల్కొండ ఇకపై ఫ్రీగా చూడొచ్చు

free entry to all historical places: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా కేంద్ర పురావస్తు శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav)పేరుతో దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రజలకు మరో మంచి ఛాన్స్ లభించింది. ఆగస్టు 5 నుంచి 15 వరకు తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలను ఎలాంటి ఎంట్రీ ఫీజ్ లేకుండానే చూసే అవకాశ్ని కల్పిస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశారు.

ఆగస్ట్ 5వ తేది నుంచి ఆగస్ట్ 15అంటే స్వాతంత్ర్య దినోత్సవం వరకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చారిత్రక, కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి ప్రవేశ రుసుము వసూలు చేయకూడదని భారత పురావస్తు శాఖ ప్రకటన చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని గోల్కొండ, చార్మినార్ వంటి కట్టడాలతో పాటు జూ పార్క్ , సాలార్‌జంగ్ మ్యూజియం వంటి వాటిలో కూడా స్థానికులకు, పర్యాటకులు ఫ్రీగా చూడవచ్చు. వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, పిల్లల మర్రి, రామప్ప టెంపుల్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. విదేశీయులకు ఎలాంటి ఎంట్రీ టికెట్‌ లేకుండా ఉచితంగానే చూసే ఛాన్స్ కల్పించింది.

ఇక ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లో అమల్లో ఉండనుంది. దేశంలోని అద్భుత కట్టడాలు, రాష్ట్రాల పరిధిలో ఉన్న పురావస్తు మ్యూజియంలు, ఎగ్జిబిషన్ కేంద్రాలతో పాటు గుర్తింపు పొందిన స్మారక చిహ్నాలను కూడా ఉచితంగా సందర్శించడానికి అనుమతి ఇవ్వాలని పురావస్తుశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

టాపిక్

తదుపరి వ్యాసం