HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gadwal Road Accident : గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

Gadwal Road Accident : గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

HT Telugu Desk HT Telugu

01 June 2024, 11:25 IST

    • Jogulamba Gadwal district News : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు.
ఎర్రవల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
ఎర్రవల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

ఎర్రవల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

Jogulamba Gadwal District News : జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లిలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

IRCTC Shirdi Tour : ఈ నెలలో 'షిర్డీ' ట్రిప్ ప్లాన్ ఉందా...? బడ్జెట్ ధరలో 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే...!

CM Revanth Reddy : మూడు విడతల్లో రైతు రుణమాఫీ పూర్తి, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

TG DOST 2024 Updates : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్ - రేపటితో ముగియనున్న'దోస్త్‌' రిపోర్టింగ్ గడువు..!

BRS Harish Rao : కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, సిద్ధంగా ఉండండి - హరీశ్ రావు కామెంట్స్

పూర్తి వివరాల్లోకి వెళ్తే…. ఏపీలోని ఆళ్ళగడ్డ ప్రాంతానికి చెందిన వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లోనే వివిధ పనులు చేసుకుంటూ స్థిరపడ్డారు. ఆళ్లగడ్డలో ఇటీవలే వెంకటేష్ బావమరిది వివాహం జరగడంతో ఆళ్లగడ్డకు వెళ్లారు. శుక్రవారం తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో రాత్రి 11 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లా, ఎర్రవెల్లి మండల కేంద్ర సమీపంలో వీరి కారు… ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వెంకటేష్ (38) అతని భార్య పుష్ప ( 35), వెంకటేష్ మేనల్లుడు ఆదిత్య ( 8),తల్లి లలిత (55) అక్కడికక్కడే మరణించారు.వెంకటేష్ అక్క కవిత,కూతురు తరుణి,కుమారుడు నందుకు తీవ్రంగా గాయాలయ్యాయి. 

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… క్షతగాత్రులను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనాలు ఢీ.....ఒకరు మృతి

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఇంధనపల్లి గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్ లోనే మరణించారు. ఎస్సై రాజ్ వర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.....ఉపాధి హామీ పనుల నిమిత్తం సన్నం రామయ్య అనే వ్యక్తి తన బైకు పై వెళుతూ ఉండగా.....ఇందన పల్లి గ్రామం శివారులో గల పెద్ద చెరువు వద్ద వెనుక వైపు నుంచి వస్తున్న మరో ద్విచక్ర వాహనం రామయ్య బైకును ఢీ కొట్టింది. 

దీంతో రామయ్య తలకు తీవ్రంగా గాయం కాగా స్థానికులు 108 కు సమాచారం అందించారు. అక్కడి నుంచి రామయ్యను కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నాలాలో పడి వృద్దుడు మృతి

ప్రమాదవశాత్తు నాలాలో పడి ఓ వృద్దుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లులో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... శంకర్ పల్లి గ్రామం జన్వాడ గ్రామానికి చెందిన నాంపల్లి మల్లయ్య (70) శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు.దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి చుట్టూ పక్కన చూడగా ఓ ఇంటి పక్కనే ఉన్న ఓ నాలాలో శవమై తేలాడు. మృతుడికి ఒక కుమార్తె,కుమారుడు ఉన్నారు.

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా.

టాపిక్

తదుపరి వ్యాసం