తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Brs Mlas: హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Medak BRS Mlas: హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

HT Telugu Desk HT Telugu

02 November 2023, 13:42 IST

google News
    • Medak BRS Mlas: ఉమ్మడి మెదక్ జిల్లాలో నలుగురు అభ్యర్థులు ఇప్పటికే రెండుసార్లు ఎన్నికలలో విజయం సాధించి ఎమ్మెల్యేలుగా పదవిలో కొనసాగుతూ, ప్రస్తుత ఎన్నికలలో మరోసారి విజయాలపై కన్నేసి ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
మెదక్‌లో హ్యాట్రిక్ విజయాలపై అభ్యర్థుల కన్ను
మెదక్‌లో హ్యాట్రిక్ విజయాలపై అభ్యర్థుల కన్ను

మెదక్‌లో హ్యాట్రిక్ విజయాలపై అభ్యర్థుల కన్ను

Medak BRS Mlas: ఉమ్మడి మెదక్ జిల్లా లో 10 నియోజకవర్గాలకు 8 స్థానాలలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు ఉన్నారు. ఈ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసిఆర్ 7 స్థానాలను సిట్టింగ్ ఎమ్మెల్యే లకు ఖరారు చేశారు. 4 స్థానాలలో ఎమ్మెల్యే లు ఈ సారి హ్యాట్రిక్ విజయాలపై కన్నేశారు. వారు మూడోసారి విజయం అందుకుంటారా .. లేదా అన్నది తేలాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సి ఉంది.

గజ్వేల్ నియోజకవర్గం...

గజ్వేల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడోసారి బరిలో ఉన్నారు. సిఎం 2014, 2018 ఎన్నికలలో గజ్వేల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఒకే స్థానం నుండి మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సీఎంగా చరిత్ర సృష్టించాలని అయన గట్టి పట్టుదలతో ఉన్నారు.

2014 లో తొలిసారిగా ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్, తెలంగాణాలో తోలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. 2018 లో తన విజయాన్ని పునరావృతం చేసి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డి ఎంతమేరకు ప్రభావం చూపుతారో తెలీదు కానీ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రం గట్టి పోటీ ఇస్తారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ 2014 లో 18 వేల ఓట్లతో గెలిచినా, 2018 లో తన మెజారిటీని 58 వేల ఓట్ల కు పెంచుకున్నారు.

పటాన్‌చెరు నియోజకవర్గం....

మినీ ఇండియా గా పిలిచే పటాన్‌చెరు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి బిఆర్‌ఎస్‌ పార్టీ నుండి వరుసగా మూడోసారి బరిలో ఉన్నారు. పటాన్‌చెరులో మహిపాల్ రెడ్డిపై బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ పోటీలో ఉన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా అధిష్టానం ఖరారు చేయలేదు. 2018లో పోటీచేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ కానీ, వారం రోజుల కింద కాంగ్రెస్ లో చేరిన నీలం మధు కానీ పోటీలో ఉండవచ్చని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మహిపాల్ రెడ్డి ఇప్పటికే తన ప్రచారం ఉధృతం చేశారు.

మెదక్ నియోజకవర్గం…

మెదక్ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆరో సారి ఎన్నికల బరిలో నిలిచారు. కానీ 2014, 2018 ఎన్నికలలో మెదక్ నుండి వరుసగా విజయం సాధించారు. 2014 లో గెలిచిన తర్వాత ఆమె శాసనసభ ఉపసభాపతిగా పనిచేశారు.

ప్రస్తుతం హ్యాట్రిక్ విజయం దిశగా తన ప్రయత్నం ముమ్మరం చేసారు. మెదక్ లో రెండు సార్లు విజయం సాధించిన పద్మాదేవేందర్ రెడ్డి గెలుపు ఇప్పుడు అంత సులభమేం కాదంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు ఈ సారి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

నారాయణఖేడ్ నియోజకవర్గం ....

నారాయణఖేడ్ లో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి వరుసగా మూడోసారి ఎన్నికల బరిలో నిలిచారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ నుండి క్రిష్ణా రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచారు. 2015లో కృష్ణారెడ్డి గుండెపోటు తో మృతి చెందటంతో, ఆ తర్వాత 2016 లో జరిగిన ఉపఎన్నికలలో మహారెడ్డి భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుండి పోటీ చేశారు.

నాటి ఎన్నికల్లో కిష్టారెడ్డి కుమారుడు సంజీవ రెడ్డి పైన విజయం సాధించారు. 2018 లో కూడా బీఆర్ఎస్ నుండి పోటీ చేసి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలిసి, హ్యాట్రిక్ విజయ పై కన్నేశారు.

తదుపరి వ్యాసం