తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Incharges: నియోజక వర్గాలకు బిఆర్‌ఎస్‌ ఇన్‌ఛార్జిల నియామకం

BRS Incharges: నియోజక వర్గాలకు బిఆర్‌ఎస్‌ ఇన్‌ఛార్జిల నియామకం

HT Telugu Desk HT Telugu

13 October 2023, 7:05 IST

google News
    • BRS Incharges : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టనున్నారని నూతనంగా నియమించబడ్డ నియోజకవర్గ బాధ్యులకు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో బిఆర్‌ఎస్‌ పార్టీ గురువారం తొలి విడత 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించింది.
కేటీఆర్‌, హరీష్‌ రావు
కేటీఆర్‌, హరీష్‌ రావు

కేటీఆర్‌, హరీష్‌ రావు

BRS Incharges : తెలంగాణ ఆవిర్భవించాక బిఆర్‌ఎస్‌ పది సంవత్సరాల పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం అయ్యేలా పార్టీ ప్రచారాన్ని నిర్వహించాలని ఇంచార్జిలకు కెటిఆర్ సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో భారత రాష్ట్ర సమితికి అద్భుతమైన సానుకూల వాతావరణం ఉందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వానికి ప్రజలు ముమ్మాటికి బ్రహ్మరథం పడుతున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి నియోజకవర్గ ఇంచార్జిలు కలిసికట్టుగా కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని ఓట్లు అడగాలని, ఇందుకోసం 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రతి ఇంటి గడపకు తీసుకువెళ్లాలని పార్టీ ఇన్చార్జిలకు కేటీఆర్ సూచించారు.

ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలు కేవలం హామీలు ఇచ్చేందుకు వేదికలు మాత్రమే అని బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 10 సంవత్సరాలలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించే ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పాలనలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం కావాలని పార్టీ నాయకులకు సూచించారు.

రానున్న 45 రోజులు అత్యంత కీలకం : హరీష్ రావు

అసెంబ్లీల వారీగా ఇన్చార్జీలుగా నియమించిన ప్రతి ఒక్క నాయకుడు ఇప్పటినుంచే పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణను, కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత వీరి పైననే ఉంటుందని, రేపటి నుంచి ఎన్నికలు ఫలితాలు వెలువడే రోజు వరకు ఆయా నియోజకవర్గాల సంపూర్ణ బాధ్యతను వీరు తీసుకోవాలని హరీష్‌రావు సూచించారు.

పార్టీ శ్రేణులు అన్నింటిని సమన్వయం చేసుకొని పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు పార్టీ ఇంచార్జ్ లకు పలు సలహాలు, సూచనలు అందించారు. రానున్న 45 రోజుల అత్యంత కీలకమని నేతలు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల నిర్వహణ మొదలుకొని నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దశల్లో పార్టీ ప్రచారం పకడ్బందీగా ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు.

రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

తదుపరి వ్యాసం