తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Rains : లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తివేత

TS Rains : లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తివేత

HT Telugu Desk HT Telugu

05 September 2023, 15:27 IST

google News
    • Lower Manair Dam : లోయర్ మానేర్ డ్యాంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో అప్రమతమైన అధికారులు డ్యామ్ లోని ఆరు గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలిపెట్టారు.
లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తివేత
లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తివేత

లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తివేత

Lower Manair Dam : వరుసగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్థంభించిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. మూడు రోజుల నుండి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో పెరుగుతుండడంతో ఆయా ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఎగువ మానేర్ తో పాటు పలు చెరువులు మత్తడి పారుతున్నాయి.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మిడ్ మానేర్ తో పాటు లోయర్ మానేర్ డ్యాంలో నీటి మట్టం గంటగంటకు పెరుగుతూ వస్తోంది.. దీంతో అప్రమతమైన అధికారులు లోయర్ మానేర్ డ్యామ్ లోని ఆరు గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలిపెట్టారు. మిడ్ మానేర్ డ్యాం నుండి 32 వేల క్యూసెక్కులు,మోయతుమ్మెద వాగు నుంచి 20 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం లోయర్ మానేర్ డ్యాం నుంచి 18 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మానేరు తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసారు. ఇన్ ఫ్లో ను అంచనా వేస్తు అవుట్ ఫ్లోను పెంచుతుంటామని… జాలర్లు ఎవ్వరు కూడా మానేరు నదిలోకి దిగవద్దని స్పష్టం చేశారు.. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు గాను 21 టీఎంసీల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు.

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయంలోకి 75,100 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఇక నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 29,800 క్యూసెక్కుల వరద వస్తోంది. నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 17 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కొద్దిరోజుల కిందట కురిసి వర్షాలకు గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ పొంగిపోర్లాయి. తాజాగా కురుస్తున్న వర్షాలకు మరోసారి ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని సింగూరు ప్రాజెక్ట్ పూర్తిగా నిండే అవకాశం కనిపిస్తోంది. ఇవాళో, రేపో ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సింగూరు ప్రాజెక్ట్ చౌటకూర్ మండలం సింగూరు గ్రామం వద్ద 25 సంవత్సరాల కింద నిర్మించబడింది. సింగూరు కింద మంజీరా నది పైన ఘనపూర్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. జులైలో కురిసిన వర్షాలతో పాటు గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు... ఈ రెండు ప్రాజెక్టులు అలుగు పారుతున్నాయి. సింగూరు ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29. 91 టీఎంసీలు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ లో కి సుమారుగా 28టీఎంసీల నీళ్లు చేరుకున్నాయి. సింగూరు పైన మంజీరా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు పడటంతో... సింగూరు ప్రాజెక్ట్ ఈ రోజు కానీ, రేపు కానీ పూర్తీ స్థాయిలో నిండిపోయే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

రిపోర్టింగ్ : గోపికృష్ణ, కరీంనగర్ జిల్లా

తదుపరి వ్యాసం