Karimnagar Bank Fire: కరీంనగర్ యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం, ఫైల్స్, ఫర్నిచర్ దగ్ధం..
02 July 2024, 10:25 IST
- Karimnagar Bank Fire: కరీంనగర్ లోని ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లోని యూనియన్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి దాటక ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అలారం మోగింది.
కరీంనగర్ యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం
Karimnagar Bank Fire: కరీంనగర్ లోని ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లోని యూనియన్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి దాటక ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అలారం మోగింది. స్థానికులు పోలీసులకు ఫైర్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
షెటర్ లాక్ పగులగొట్టి అద్దాలను ద్వంసం చేసి రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను పైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. దాదాపు రెండు గంటల పాటు ఫైర్ సిబ్బంది కష్టపడ్డారు. అప్పటికే బ్యాంకు లోని ఫర్నిచర్ కొన్ని ఫైళ్ళు దగ్ధమయ్యాయి. నగలు నగదు సేఫ్ గా ఉన్నాయి.
టెక్నికల్ ప్రాబ్లమ్...రాత్రి వరకు బ్యాంక్ లోనే ఉద్యోగులు
ఎప్పుడైనా రాత్రి 7:00 వరకే బ్యాంక్ పని ముగించుకుని ఉద్యోగులు సిబ్బంది వెళ్ళిపోతారు. కానీ సోమవారం సాంకేతిక సమస్య ఉత్పన్నం కావడంతో రాత్రి పదిన్నర గంటల వరకు విధినిర్వాహంలోనే బ్యాంకు సిబ్బంది ఉన్నారు. సిబ్బంది లాక్ వేసి వెళ్లిన గంట తర్వాత కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో దట్టమైన పొగతో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.
అలారం మోగడంతో బస్టాండ్ వద్ద ఉండే వారు చూసి పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు బ్యాంక్ వద్దకు చేరుకుని షట్టర్ లాక్ దొరకకపోవడంతో లాక్ ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు. రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
అలెర్ట్ చేసిన అలారం…
కరెంటు షార్ట్ సర్క్యూట్ తో బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించగా సకాలంలో మంటలను అదుపులోకి తేవడానికి అలారం అలర్ట్ చేసింది. అర్ధరాత్రి దట్టమైన పొగతో బ్యాంకు నుంచి మంటలు రావడంతో అలారం మోగగా బస్టాండ్ వద్ద ఉన్న వారు గమనించి పోలీసులకు పైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
అలారం మోగకుంటే ఎవరు గమనించకుంటే భారీ నష్టం సంభవించేదని బావిస్తున్నారు. అలారం వల్ల తృటిలో భారీ నష్టం తప్పిందని బ్యాంక్ అధికారులు తెలిపారు. బ్యాంకులో సాంకేతిక సమస్యతో రాత్రి వరకు పని చేయాల్సి వచ్చిందన్నారు.
లాకర్ లోని నగలు నగదు సేఫ్ గా ఉందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫర్నిచర్, కొన్ని ఫైల్స్ దగ్ధం కాగా అద్దాలు ద్వంసం అయ్యాయి. ప్రమాదానికి గురైన బ్యాంక్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యాంక్ అధికారులు ప్రమాదంపై విచారణ చేపట్టారు.
(రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా)