తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కోమటిరెడ్డి బ్రదర్స్ పై దామోదర్ రెడ్డి ఫైర్.. బ్రాండ్ కాదంటూ వ్యాఖ్యలు

కోమటిరెడ్డి బ్రదర్స్ పై దామోదర్ రెడ్డి ఫైర్.. బ్రాండ్ కాదంటూ వ్యాఖ్యలు

05 August 2022, 18:38 IST

google News
    • కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారంపై  మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చండూరులో తలపెట్టిన సభలో మాట్లాడిన ఆయన.. కోమటిరెడ్డి బ్రాండ్ కాదని… కాంగ్రెస్ పార్టీనే బ్రాండ్ అంటూ కామెంట్స్ చేశారు.
కోమటిరెడ్డిపై దామోదర్ రెడ్డి ఫైర్
కోమటిరెడ్డిపై దామోదర్ రెడ్డి ఫైర్ (facebook)

కోమటిరెడ్డిపై దామోదర్ రెడ్డి ఫైర్

ex minister ramreddy damodar reddy: మునుగోడులోని తాజా పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారమే సృష్టిస్తోంది. ఇవాళ చండూరులో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయిలో సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి... సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తీరును టార్గెట్ చేస్తూ మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ కాదని... కాంగ్రెస్ పార్టీనే బ్రాండ్ అంటూ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అనేక అవకాశాలు ఇచ్చిందని గుర్తు చేశారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను ఎందుకు కలిశారని నిలదీశారు. ఎవరు ఉన్నా లేకున్నా... మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అంటూ ఘాటుగా మాట్లాడారు. ఎన్నిక ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని గుర్తు చేశారు.

ఇక మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డి సభలో మాట్లాడారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు మునుగోడు గడ్డ నుంచి రాజకీయంగా ఎదిగారని అన్నారు. పేదల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు చేసిందని అన్నారు. ఆహార భద్రత, ఉపాధి హామీ వంటి పథకాలను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. రుణమాఫీతో పాటు అనేక అంశాల్లో మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీతో పాటు ధరలు పెంచిన బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. అధికార అహంకారంతో రెండు ప్రభుత్వాలకు మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు.

మాజీ మంత్రి షబీర్ అలీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి ఎప్పుడు వచ్చాడంటూ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎటువైపు ఉంటారో నిర్ణయించుకోవాలని సవాల్ విసిరారు. అమిత్ షాతో భేటీ ఎందుకు అవుతాడని నిలదీశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

తదుపరి వ్యాసం