Telangana Election Polling : తెలంగాణ ఓటర్లకు అలర్ట్… ఈ 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం కుదింపు
30 October 2023, 19:44 IST
- Telangana Assembly Elections 2023:తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం కుదించింది ఎన్నికల సంఘం. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అప్ డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించామని, ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని కుదిస్తామని తెలిపింది. ఈమేరకు ఈసీ విడుదల చేసిన ప్రకటనలో.. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగించనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలోని మిగతా 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది.
ఆ 13 నియోజకవర్గాలు ఇవే :
సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకే పోలింగ్ జరగనుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్:
ఎన్నికల షెడ్యూల్ : 09 -10 -2023
నోటిఫికేషన్ : 03 - 11 - 2023
నామినేషన్లకు చివరి తేదీ - 10.11.2023
నామినేషన్ల పరిశీలన - నవంబర్ 13, 2023
నామినేషన్ల ఉపసంహరణ - నవంబర్ 15, 2023
పోలింగ్ - 30 నవంబర్, 2023
ఓట్ల లెక్కింపు - డిసెంబర్ 3, 2023
తెలంగాణ రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో 14,464 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉండగా… 20,892 గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. సగటున ప్రతి పోలింగ్ కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. 27,798 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3వ తేదీన విడుదల కానుండగా… నామినేషన్లను నవంబర్ 11వ తేదీ వరకు స్వీకరిస్తారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.