ED IT Raids Telangana: హైదరాబాద్, కరీంనగర్ లో ఈడీ, ఐటీ సోదాలు
09 November 2022, 12:05 IST
- ED Raids in Hyderabad: తెలంగాణలో ఈడీ, ఐటీ శాఖ అధికారులు దాడులు చేపట్టారు. హైదరాబాద్ తో పాటు కరీంనగర్ లో ఈ సోదాలు జరుగుతున్నాయి.
కరీంనగర్, హైదరాబాద్ లో ఈడీ సోదాలు
ED and IT Raids in elangana: ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. హైదరాబాద్ తో పాటు కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు జరిపారు. గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నాయి.
ఈ రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 30 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో 20కి పైగా ఈడీ, ఐటీ బృందాలు పాల్గొన్నాయి. పంజాగుట్ట, ఉప్పరపల్లి, పంజాగుట్టలోని పి.ఎస్.ఆర్. గ్రానైట్స్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు అధికారులు. గ్రానైట్ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ ఫిర్యాదులకు సంబంధించి పలు కంపెనీలకు నో
బుధవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో దాదాపు 20 బృందాలు, 10 వాహనాల్లో సోదాలు నిర్వహించేందుకు ఈడీ కార్యాలయం నుంచిబయలుదేరాయి. వాటిలో కొన్ని బృందాలు కరీంనగర్‌వైపు వెళ్లగా.. మరికొన్ని బృందాలు హైదరాబాద్‌లో సోదాలు చేపట్టాయి.
మరోవైపు గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈడీ, ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులోనూ ఈడీ దూకుడుగా ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ కాగా... పలువురికి నోటీసులు అందజేసింది.