తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Irrigation Enc Issue: తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ల తొలగింపు.. బడ్జెట్‌ సమావేశాల ముందు కీలక నిర్ణయం

TS Irrigation EnC Issue: తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ల తొలగింపు.. బడ్జెట్‌ సమావేశాల ముందు కీలక నిర్ణయం

Sarath chandra.B HT Telugu

08 February 2024, 9:56 IST

google News
    • TS Irrigation EnC Issue: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందు ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో కీలక నిర్ణయాలకు బాధ్యులైన అధికారులపై వేటు పడింది. ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లుగా పనిచేస్తున్న ఇద్దరు సీనియర్లను ప్రభుత్వం తొలగించింది. 
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నేపథ్యంలో ఈఎన్‌సీల వేటు వేసిన ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నేపథ్యంలో ఈఎన్‌సీల వేటు వేసిన ప్రభుత్వం

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నేపథ్యంలో ఈఎన్‌సీల వేటు వేసిన ప్రభుత్వం

TS Irrigation EnC Issue: మేడిగడ్డ ప్రాజక్టులో పిల్లర్లు కుంగిపోవడంతో పాటు అన్నారంలో బుగ్గలు ఏర్పడిన వ్యవహారంలో కీలక చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ద రోజుల ముందు మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల్లో తలెత్తిన సమస్యలు ఎన్నికల్లో ప్రభావం చూపించాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.

ఈ క్రమంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానుండగా బుధవారం సాయంత్రం అనూహ్యంగా ఇద్దరు ఇంజనీర్ ఇన్ చీఫ్‌ స్థాయి అధికారులను తొలగించాలని నిర్ణయించింది. ఇంజనీర్‌ ఇన్ చీఫ్‌గా పదేళ్లు రిటైర్మెంట్ తర్వాత పనిచేస్తున్న మురళీధర్‌ను రాజీ నామా చేయాలని ఆదేశించారు.

ఆయనతో పాటు కాళేశ్వరం ఎత్తి పోతల (రామగుండం) ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వర్లును సర్వీసు నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

కాళేశ్వరం ఈఎన్‌సి వెంకటేశ్వర్లును సర్వీసు నుంచి తొలగిస్తూ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదే శాలు జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబా టు వ్యవహారంపై విజిలెన్స్ విచారణ, కృష్ణాబోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల అంశం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

తెలంగాణ నీటిపారుదల శాఖలో కీలకమైన ఇంజినీర్ ఇన్ చీఫ్ పదవికి కొత్త వారిని నియమించనున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో నలుగురు ఈఎన్‌సీలు ఉన్నారు. వారిలో సీనియర్‌గా ఉన్న అనిల్‌ కుమార్‌ను పరిపాలన ఈఎన్‌సిగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.

కాళేశ్వరం ఈఎన్‌సి వెంకటేశ్వర్లు స్థానంలో అదనపు బాధ్యతలకు ప్రతిపాదన లను పంపాలని ఈఎన్‌సి అనిల్ కుమార్‌కు రాహుల్ బొజ్జా సూచించారు. ప్రాజెక్టుల్లో అక్రమాలకు కారణమైన ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించడంతో వారిపై వేటు పడింది.

నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గా 2013లోనే మురళీధర్ పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి పదేళ్లుగా ఆయన సర్వీసును పొడిగిస్తూ వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన సర్వీసును పొడిగించారు.

కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా పదవీ విరమణ చేసిన నల్లా వెంకటేశ్వర్లు సర్వీసును గత ప్రభుత్వంలో పొడిగించించారు. మూడేళ్లుగా సర్వీసు పొడిగింపులో ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, పియర్స్ దెబ్బ తినడంపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ విభాగం బ్యారేజ్ నిర్మాణంలో అనేక లోపాలను ఎత్తిచూపింది.

కాంట్రాక్టర్‌కు పూర్తి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై వేటు పడింది. వచ్చే ఏడాది మార్చి వరకు సర్వీసు ఉన్నా విధుల నుంచి తొలగించారు. విజిలెన్స్ పూర్తి స్థాయి దర్యాప్తు నివేదికలో వెంకటేశ్వర్లుపై మరిన్ని చర్యలకు సిఫార్సు ఉంటాయని భావిస్తున్నారు.

తదుపరి వ్యాసం