Sadaram Slots: సదరం స్లాట్‌కు తప్పని తిప్పలు..! సర్టిఫికెట్ల కోసం దివ్యాంగుల పడిగాపులు..
08 February 2024, 13:26 IST
- Sadaram Slots: వారంతా శారీరక వైకల్యం ఉన్న వారు.. దృష్టి, వినికిడి లోపాలతో పాటు మానసిక దివ్యాంగులు… జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతీనెల నిర్వహించే సదరం సర్టిఫికెట్ కోసం ప్లాట్లు బుక్ చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు.
సదరం టోకెన్ల కోసం మీ సేవా కేంద్రాల్లో దివ్యాంగుల పడిగాపులు
Sadaram Slots: దివ్యాంగుల ధృవీకరణలు స్లాట్ బుక్ చేసుకుంటేనే వైద్య పరీక్ష లు నిర్వహిస్తుండడంతో వారంతా మీసేవ కేంద్రాల వద్ద స్లాట్ బుకింగ్ కోసం పడిగాపులు కాస్తున్నారు.
కొత్తగా సదరం సర్టిఫికెట్ పొందాలన్నా.. ఇప్పటికే ఉన్నవారు రెన్యువల్ చేసుకోవాలన్నా స్లాట్ బుకింగ్ తప్పనిసరి. క్యాంపు నిర్వహించే రెండు రోజుల ముందు స్లాట్ బుకింగ్ అవకాశం కల్పిస్తున్నారు. ఓపెన్ చేసిన పది నిమిషాల్లోనే స్లాట్లు అయిపోతు న్నాయి.
దీంతో దివ్యాంగులు మీసేవ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే క్యూ కడుతున్నారు. ఉదయం 6 గంటలకే జిల్లాలోని మీసేవ కేంద్రాల వద్దకు దివ్యాంగులు చేరుకుంటున్నారు. 10 గం టలకు దరఖాస్తుదారులు తమ పత్రాలు అందించి స్లాట్ బుకింగ్ చేస్తుండగానే క్లోస్ అయిపోతున్నాయి . దీంతో అప్పటి వరకు నిరీక్షించిన దివ్యాంగులు ఉసూరుమంటు వెనుదిరుగుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్, మాంచెరియల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తదితర మండల కేంద్రాల్లో... సదరం నమోదు కోసం దివ్యాంగులు మీసేవ కేం ద్రాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఒక్కో కేంద్రం లో ఒకటి, రెండు స్లాట్లు మాత్రమే నమోదవుతు. న్నాయి. కొంతమందికే స్లాట్ నమోదవుతుండడం తో మిగతా వారు నిరాశ చెందుతున్నారు.
ప్లాట్ల సంఖ్య పెంచాలని దివ్యాంగులు కోరుతున్నారు. అంతే కాక దివ్యాంగులను గుర్తించే క్రమంలో ఎక్కువ శాతం వైకల్యం ఉన్నవారికి శాశ్వత ప్రాతిపదికన, మరికొందరికి కాలపరిమితితో సదరం సర్టిఫికెట్ ఇస్తుంటారు. గడువు ముగిసిన తర్వాత తిరిగి పరీక్ష లు చేయించుకుని మళ్లీ సర్టిఫికెట్ పొందాలి. లేదంటే పింఛన్ మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. మరోవైపు స్లాట్ బుకింగ్ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
వైకల్యాన్ని నిర్ధారించే క్రమంలోనే కొందరికి పర్మినెంట్ సదరం సర్టిఫికెట్, మరికొందరికి రెండు మూడేండ్ల కాలపరిమితితో సర్టిఫికెట్లు జారీ చేస్తుంటారు. ఇలా రెండు, మూడేండ్ల కాలపరివి సర్టిఫికెట్లు పొందినవాళ్లు..గడువు తీరిన తర్వాత మళ్లీ స్లాట్ బుక్ చేసుకుని వైకల్య నిర్ధారణప చేయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే వారికి ఆసరా పింఛన్ ఆగిపోతుంది.
దీంతో వారు నెలల తరబడి మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో నెలలు, సంవత్స తరబడి పింఛన్ కోల్పోతున్న బాధితులు వందల్లో ఉన్నారు. ఇది తమ హక్కులను హరించడ ఇప్పటికైనా స్లాట్స్ సంఖ్య పెంచి అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లు జారీ చేయాలని దివ్యాంగు కోరుతున్నారు.
దివ్యాంగులకు స్లాబ్ వ్యవస్థ ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతోందని, స్లాట్ దొరకకపోవడం వల్ల సదరం సర్టిఫికెట్ పొందలేకపోవడం, పింఛన్ రాకపోవడం దివ్యాంగుల చట్టం ఉల్లంఘన కిందకే వస్తుందని కోర్ట్ ఆఫ్ స్టేట్ కమిషన్ ఫర్ పర్సనల్ డిసేబులిటీస్ కింద కోర్టులో దావలు సైతం నమోదు అవుతున్నాయి.
టోకెన్లు పెంచాలి....
సదరం క్యాంపుకు హాజరయ్యే దివ్యాంగులకు ఇచ్చే టోకెన్లు పెంచాలని దరఖాస్తుదారులు కోరుతు న్నారు. వైకల్యం ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నందున శారీరక వికలాంగులు, దృష్టిలోపం.. వినికిడి లోపం, మానసిక వైకల్యం తదితర సమస్యలు ఉన్న వారికి ప్రతీ విభాగానికి 200 టోకెన్లు ఇవ్వాలి .
ప్రస్తుతం దివ్యాంగులందరికీ 200 టోకెన్లు మాత్రమే ఇస్తున్నారు. వీటిలోనే కొత్తవారు, రెన్యువల్ చేసుకోవాల్సిన వారు బుకింగ్ చేసు కోవాల్సిన పరిస్థితి. టోకెట్ లభించకపోతే మళ్లీ నెల రోజులు వేచి చూడాల్సి వస్తుంది.
(రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్జి జిల్లా)