తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cpi Narayana : కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు- సీపీఐ నారాయణ

CPI Narayana : కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు- సీపీఐ నారాయణ

30 August 2023, 18:20 IST

google News
    • CPI Narayana : కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తే కేసీఆర్ కు డిపాజిట్లు కూడా రావని సీపీఐ నారాయణ అన్నారు.
సీపీఐ నారాయణ
సీపీఐ నారాయణ

సీపీఐ నారాయణ

CPI Narayana : తెలంగాణలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కలిస్తే పోటీ చేస్తే బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని సీపీఐ సీనియర్ నేత నారాయణ అన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, వాళ్లకు కొట్లాటలుంటాయి, బయట కొట్టుకుంటారన్నారు. అయినా కాంగ్రెస్ ఒక సెక్యులర్ పార్టీ, జాతీయ స్థాయిలో ముఖ్యపాత్ర వహిస్తుందన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కూటమిగా ఏర్పడితే కేసీఆర్ కు డిపాజిట్లు కూడా రావన్నారు. కావాలంటే +తాను రాసిస్తానన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కులుపుకుంటుందో లేదో తెలియదన్నారు.

వైసీపీ, బీజేపీ లివింగ్ టుగెదర్ రిలేషన్

ఏపీ పాలిటిక్స్ పై మాట్లాడిన సీపీఐ నారాయణ ...పొత్తుల విషయంలో టీడీపీ ఊగిసలాట వీడాలని సూచించారు. ఏపీలో వైసీపీ, బీజేపీ కలిసే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా టీడీపీ మేల్కొని ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటు చేయాలని కోరారు. టీటీడీ పాలకమండలిలో లిక్కర్ వ్యాపారులకు చోటివ్వడం సరికాదన్నారు. వైసీపీ, బీజేపీ లివింగ్‌ టుగెదర్‌ రిలేషన్ లో ఉన్నారని నారాయణ సెటైర్లు వేశారు. వాళ్లు విడిపోరన్నారు. ఏపీలో బీజేపీ ఎంత పోరాడిన వైసీపీని ఓడించే స్థాయికి రాదన్నారు. ఏపీకి అన్ని విధాలుగా నష్టం చేసిన బీజేపీకి టీడీపీ, వైసీపీ సహకరించడం మంచిది కాదన్నారు. సీపీఐ, సీపీఎం, జనసేనతో టీడీపీ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తే వైసీపీ, బీజేపీ డబుల్ ఇంజిన్‌ ఫెయిల్‌ అవుతుందన్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ పచ్చి అవకాశవాదులని విమర్శించారు. కవిత విషయంలో సీఎం కేసీఆర్ బీజేపీకి తలొగ్గారని అన్నారు.

చంద్రబాబు ఊగిసలాట

తెలంగాణలో కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్ కూటమి నిశ్చితార్థం స్టేజ్‌లో ఉందని నారాయణ వ్యాఖ్యానించారు. ఎంఐఎంతో కలిసి కేసీఆర్‌ మూడో ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తారని అని తెలుస్తోందన్నారు. కేసీఆర్‌ నుంచి ఇంకొంచెం​ ముందు బయటపడాల్సి ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌, సీపీఐ కూటమిగా కలిస్తే కేసీఆర్‌కు డిపాజిట్లు రావన్నారు. బీజేపీ ఊగిసలాట నుంచి చంద్రబాబు బయటపడాల్సి ఉందన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మార్పుతో తెలంగాణలో బీజేపీ పనైపోయిందన్నారు. ఓట్ల ప్రాతిపదికన కాకుండా ఒకరికి ఒకరు అవసరం అనే అంశంపై కాంగ్రెస్, కామ్రేడ్ల పొత్తులపై చర్చ జరపాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావాలని కోరారు. ఎన్నికల కోసమే గ్యాస్ ధర రూ. 200 తగ్గించారని, చిత్తశుద్ధి ఉంటే మోదీ హయాంలో రూ.1200లకు పెరిగిన గ్యాస్ ధరను 2014లో ఉన్న ధర కంటే తక్కువకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తదుపరి వ్యాసం