తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Traffic Challans : ట్రాఫిక్ జరిమానాలు చెల్లించిన దానం నాగేందర్

Traffic Challans : ట్రాఫిక్ జరిమానాలు చెల్లించిన దానం నాగేందర్

HT Telugu Desk HT Telugu

20 June 2022, 12:18 IST

google News
    • ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఎమ్మెల్యే వాహనాన్ని పోలీసులు విడిచిపెట్టడం వివాదాస్పదమైన నేపథ్యంలో, చలాన్‌ బకాయిలను దానం నాగేందర్ చెల్లించారు. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

సోషల్ మీడియా దెబ్బకు అధికార పార్టీ ఎమ్మెల్యే దారికొచ్చారు.  అధికారంలో ఉన్నామనుకుని ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన జరిమానాలు కట్టకుండా తిరిగేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే తీరును నెటిజన్లు నిలదీయడంతో ఒకేసారి 66చలాన్లను క్లియర్‌ చేశారు.

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే వాహనాన్ని పోలీసులు విడుదల చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో బకాయిలన్నింటిని ఒకేసారి  చెల్లించిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ వాహనాన్ని ఇటీవల పోలీసులు ఆపారు. ఆ వాహనంపై  రూ.5175 రుపాయల జరిమానాలు బకాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వాహనాన్ని విడిచిపెట్టారు. ఈ విషయం తీవ్ర దుమారాన్నిరేపింది.  ఎమ్మెల్యేకో న్యాయం సామాన్యులకో న్యాయమా  అంటూ నెటిజన్లు నిలదీశారు. 

సోషల్ మీడియాలో  ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ట్రోల్ చేయడంతో దానం నాగేందర్ తన వాహనాలకు ఉన్న బకాయిలన్నింటిని చెల్లించారు. దానం నాగేందర్‌కు చెందిన ఐదు వాహనాలపై  ఇప్పటి వరకు 66చలాన్లు నమోదయ్యాయని  పోలీసులు గుర్తించారు.  వివిధ సందర్భాల్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి నమోదైన కేసుల్లో ఎమ్మెల్యే రూ.37,365 జరిమానా చెల్లించారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే నిర్వాకంపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో ఒకేసారి అన్ని వాహనాల జరిమానాలు చెల్లించారు. బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులకు  ఎమ్మెల్యే సిబ్బంది జరిమానా మొత్తాన్ని చెల్లించారు.

సోషల్ మీడియాలో  విస్తృత ప్రచారం నేపథ్యంలోనే ఎమ్మెల్యే వాహనాలకు జరిమానాలు చెల్లించినట్లు బంజారాహిల్స్‌ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. 

టాపిక్

తదుపరి వ్యాసం