MLAs Purchase Case: ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చారు - సైబరాబాద్ సీపీ
26 October 2022, 21:12 IST
- To buy four TRS legislators Case: టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలతో బేరసారాల అంశం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన పలు వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ట్రాప్ !
Trying to buy TRS MLAs Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం వెలుగు చూసింది. ప్రధాన రాజకీయ పార్టీలకు మునుగోడు ఉపఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన వేళ... నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఆపరేషన్ ను భగ్నం చేసిన సైబారాబాద్ పోలీసులు. ఈ మేరకు సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలను వెల్లడించారు.
సీపీ ఏం చెప్పారంటే…
టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకు రైడ్ చేశామని చెప్పారు సైబారాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. డబ్బులతో పాటు కాంట్రాక్ట్ లు ఇస్తామని ప్రలోభాలు పెడుతున్నారంటూ చెప్పారు వెల్లడించారు. ఈ మేరకు మెయిన్ బాద్ లోని ఫౌమ్ హౌజ్ పై తనిఖీలు చేయగా... ముగ్గురు వ్యక్తులు దొరికారని తెలిపారు. వీరిలో రామచంద్రభారతి, సింహయాజులు, సతీశ్ శర్మ ఉన్నారని పేర్కొన్నారు. వీరిని హైదరాబాద్ కు చెందిన నందకుమార్ అనే వ్యక్తి రప్పించారని సీపీ వెల్లడించారు. ఫౌమ్ హౌజ్ వేదికగా ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రాథమికంగా వెల్లడైందని చెప్పారు. రామచంద్రభారతి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోందన్న ఆయన... విచారణ తర్వాత పూర్తి స్థాయిలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.