తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Street Dogs Murder: వీధి కుక్కలపై అమానుషం.. పెంపుడు కుక్కను చంపాయని 20 వీధి కుక్కల కాల్చివేత

Street Dogs Murder: వీధి కుక్కలపై అమానుషం.. పెంపుడు కుక్కను చంపాయని 20 వీధి కుక్కల కాల్చివేత

Sarath chandra.B HT Telugu

20 March 2024, 7:39 IST

google News
    • Street Dogs Murder: పెంపుడు కుక్కపై వీధి కుక్కలు దాడి చేసి చంపడంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి 20కుక్కల్ని కాల్చి చంపాడు. ఈ అమానుష ఘటన మహబూబ్‌నగర్‌లో జరిగింది. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీ
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీ

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీ

Street Dogs Murder: ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క Pet Dog పై వీధి కుక్కలు Street Dogs దాడి చేసి చంపేయడంతో పగతో రగిలిపోయిన ఓ వ్యక్తి విచక్షణ మరిచిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 వీధి కుక్కల్ని కాల్చి చంపేశాడు. వీధికుక్కలపై ప్రతీకారం తీర్చుకోడానికి కనిపించిన కుక్కనల్లా కాల్చేశాడు. ఈ ఘటనలో అతనికి మరో మరో ఇద్దరు సహకరించారు.

తుపాకీతో 20 వీధి కుక్కల్ని20 Dogs  కాల్చిన కేసులో మహబూబ్‌నగర్‌ Mahabub Nagar పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. తాను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కపై దాడి చేసి చంపేశాయనే అక్కసుతో స్నేహితులతో కలిసి తుపాకీతో కాల్చి 20 వీధికుక్కలను చంపేసినట్టు పోలీసులు  గుర్తించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్‌ Ponnkal Village గ్రామంలో గత నెలలో జరిగిన వీధి కుక్కల మరణం వెనుక మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ మంగళవారం కేసు వివరాలను జిల్లా కేంద్రంలో వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం దేవునిపల్లికి చెందిన మంద నర్సింహారెడ్డి(57) హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అతడికి ఫలక్‌నుమాకు చెందిన తారీఖ్‌ అహ్మద్‌(42), మహ్మద్‌ తాహెర్‌(40) స్నేహితులు. నర్సింహా రెడ్డి అత్త ఊరైన అడ్డాకుల మండలం పొన్నకల్‌ గ్రామంలో కుక్కలను పెంచుతున్నారు. వారి ఇంట్లో డాక్స్‌హుండ్‌ జాతి రకం పెంపుడు కుక్కలు ఉన్నాయి.

కొద్ది నెలల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సమయంలో పెంపుడు కుక్కల్లో ఒకదాన్ని ఆ గ్రామంలోని వీధి కుక్కలు కరిచి చంపేశాయి. మరోదానిపై దాడి చేసి గాయపరిచయాి. దీంతో వాటిపై కోపం పెంచుకున్న నర్సింహారెడ్డి ఫిబ్రవరి 15న తన కారులో స్నేహితులతో కలిసి పొన్నకల్‌ వచ్చాడు.

అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో తారిఖ్‌ అహ్మద్‌ వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ తుపాకీతో గ్రామంలో కనిపించిన కుక్కలన్నింటినీ కాల్చుకుంటూ వెళ్లారు. ఈ ఘటనలో 20 శునకాలు చనిపోయాయి. మర్నాడు గ్రామంలో కుక్కలు చనిపోయి ఉండటంతో పంచాయితీ కార్యదర్శి విజయ రామరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితులు బెంజ్‌కారులో వచ్చారని గుర్తించారు. పొన్నకల్‌ గ్రామంలో దావత్‌ చేసుకోడానికి ముగ్గురు అదే కారులో మంగళవారం వచ్చారు. విశ్వసనీయ సమాచారంతో భూత్పూరు సీఐ ఎస్‌.రామకృష్ణ, అడ్డాకుల ఎస్సై ఎం.శ్రీనివాస్‌ నేతృత్వంలో పోలీసులు బృందం గ్రామానికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 0.22 రైఫిల్‌, 6 సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

తదుపరి వ్యాసం